Advertisement

  • క్రికెట్లో కరోనా సబ్‌స్టిట్యూట్‌ ..కొత్త రూల్స్ కు ఐసీసీ ఆమోదం

క్రికెట్లో కరోనా సబ్‌స్టిట్యూట్‌ ..కొత్త రూల్స్ కు ఐసీసీ ఆమోదం

By: Sankar Wed, 10 June 2020 09:10 AM

క్రికెట్లో కరోనా సబ్‌స్టిట్యూట్‌ ..కొత్త రూల్స్ కు ఐసీసీ ఆమోదం

కరోనా మహమ్మారి దెబ్బతో క్రికెట్ టోర్నీ రెండు నెలలకు పైగానే వాయిదా పడ్డాయి..ఇపుడిపుడే మళ్ళీ ప్రారంభం అవుతున్నాయి..అయితే కరోనా కారణముగా క్రికెట్ లో చాల మార్పులు వస్తున్నాయి..తాత్కాలిక ప్రాతిపదికన ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని మంగళవారం ప్రకటించింది. ఆటగాళ్ల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూనే మైదానంలో మరికొన్ని సడలింపులు ఇస్తున్నట్లు వెల్లడించింది. అనిల్‌ కుంబ్లే నాయకత్వంలోని ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఈ ప్రతిపాదనలు చేసింది. మరోవైపు వచ్చే 12 నెలలపాటు ఆటగాళ్లు ధరించే దుస్తులకు సంబంధించి కూడా ఐసీసీ ఒక సడలింపు ఇచ్చింది. స్పాన్సర్‌షిప్‌కు సంబంధించి ఇప్పటికే అనుమతించిన మూడు లోగోలతో పాటు ఇకపై ఛాతీ భాగంలో కూడా అదనంగా 32 చదరపు అంగుళాలకు మించకుండా మరో లోగోను ప్రదర్శించుకునేందుకు వీలుంది. ఐసీసీ ఆమోదించిన ప్రధాన అంశాలను చూస్తే...

icc,cricket,new rules,corona substitute,umpires ,కరోనా సబ్‌స్టిట్యూట్‌, ఐసీసీ , కరోనా మహమ్మారి ,  అనిల్‌ కుంబ్లే ,  క్రికెట్‌ కమిటీ


1 టెస్టు మ్యాచ్‌ జరిగే సమయంలో ఎవరైనా ఆటగాడికి కరోనా లక్షణాలు కనిపిస్తే కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌ తరహాలోనే అతని స్థానంలో మరొకరిని రిఫరీ అంగీకారంతో ఆడించుకోవచ్చు. అయితే ఈ నిబంధన వన్డే, టి20ల్లో వర్తించదు.
2 ఏ బౌలర్‌ కూడా బంతి మెరుపు పెంచేందుకు సలైవాను వాడరాదు. ఆటగాళ్లు దీనికి అలవాటు పడే వరకు అంపైర్లు కాస్త స్వేచ్ఛనిస్తారు. ఆ తర్వాత హెచ్చరించడం మొదలవుతుంది. రెండు హెచ్చరికల తర్వాత కూడా అదే చేస్తే బ్యాటింగ్‌ జట్టుకు 5 పెనాల్టీ పరుగులు ఇస్తారు. ఉమ్మి వాడినట్లు అంపైర్లు గుర్తిస్తే ఆ బంతిని వేసే ముందే తుడిచేయాలని వారు ఆదేశించగలరు.

3 ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర దేశాలకు చెందిన తటస్థ అంపైర్లకు బాధ్యతలు ఇవ్వడం కష్టం కాబట్టి ఆయా క్రికెట్‌ బోర్డులకు చెందిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఎలైట్‌ ప్యానెల్‌ అంపైర్లే మ్యాచ్‌ విధులు నిర్వర్తిస్తారు.

4 స్థానిక అంపైర్లకు అనుభవం తక్కువగా ఉంటే నిర్ణయాల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది కాబట్టి అదనంగా మరో రివ్యూను ఇస్తారు. దీని ప్రకారం టెస్టుల్లో ఒక్కో ఇన్నింగ్స్‌లో రెండుకు బదులుగా 3 రివ్యూలు ఉంటాయి. వన్డే, టి20ల్లో ఒకటినుంచి రెండుకు పెంచారు.


Tags :
|

Advertisement