Advertisement

  • బ్రేకింగ్ న్యూస్.. టి ట్వంటీ ప్రపంచ కప్ వాయిదా ..

బ్రేకింగ్ న్యూస్.. టి ట్వంటీ ప్రపంచ కప్ వాయిదా ..

By: Sankar Mon, 20 July 2020 8:54 PM

బ్రేకింగ్ న్యూస్.. టి ట్వంటీ ప్రపంచ కప్ వాయిదా ..



అందరూ ఊహించినట్టే జరిగింది. టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడింది. వచ్చే ఏడాదికి టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేస్తున్నట్టు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఆదివారం జరిగిన వర్చువల్‌ మీటింగ్‌లో ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహిస్తామని ఐసీసీ వెల్లడించింది. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ మాసాల్లో పొట్టి ఫార్మాట్‌ వరల్డ్‌ కప్‌ నిర్వహించాల్సి ఉండగా.. కరోనా భయాల నేపథ్యంలో వాయిదా తప్పలేదు.

ఇక ప్రపంచ కప్ వాయిదా పడటంతో ఐపీయల్ నిర్వహణకు మార్గం సుగమం అయింది ..ఇప్పటికే ఐపీయల్ నిర్వహణ గురించి అనేక వార్తలు వస్తుండటంతో ఈ ప్రపంచ కప్ వాయిదాతో ఐపీయల్ నిర్వహించడానికి ఏ ఆటంకాలు లేవు.అయితే ఐపీఎల్ 2020 సీజన్‌ షెడ్యూల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ క్లారిటీకి వచ్చేసింది..

సెప్టెంబరు 26 నుంచి ఈ టోర్నీని ప్రారంభించాలని యోచిస్తున్న బీసీసీఐ.. నవంబరు 8న ఫైనల్‌ జరిగేలా షెడ్యూల్‌ రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి. 44 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు అని తెలుస్తుంది..అయితే ఫైనల్ ను ఇంకో వారం పోస్టుపోన్ చేయాలనీ స్టార్‌స్పోర్ట్స్ కోరుతున్నట్లు తెలుస్తుంది ..

Tags :
|

Advertisement