Advertisement

  • ఐసీసీ కి కొత్త చైర్మన్ ఎన్నికపై చర్చ ..రేస్ లో గంగూలీ ..?

ఐసీసీ కి కొత్త చైర్మన్ ఎన్నికపై చర్చ ..రేస్ లో గంగూలీ ..?

By: Sankar Thu, 25 June 2020 3:20 PM

ఐసీసీ కి కొత్త చైర్మన్ ఎన్నికపై చర్చ ..రేస్ లో గంగూలీ ..?





చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియే ప్రధాన ఎజెండాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బోర్డు ఆన్‌లైన్‌ సమావేశం కానుంది. గురువారం జరిగే ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్త చైర్మన్‌ ఎన్నిక గురించి చర్చించనుంది. గత సమావేశంలో టీ20 వరల్డ్‌కప్‌ భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన బోర్డు.. చైర్మన్‌ నామినేషన్‌ గురించి ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ప్రస్తుత చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ పదవీ కాలం ఈ నెలతో ముగుస్తుంది. ‘ఎన్నికల తేదీలను ఈ సమావేశంలో నిర్ణయిస్తారో? లేదో? తెలియదు.

కొత్త చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ గురించి చర్చించడమే ఎజెండా’ అని ఐసీసీ బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు. ఐసీసీ కొత్త చైర్మన్‌ పదవి కోసం ఇంగ్లండ్‌ బోర్డు చైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌ ముందున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పేరు కూడా వినిపిస్తోంది. కాగా, గంగూలీ సొంత రాష్ట్రంలో పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని.. అందువల్ల ఈ ఐసీసీ పదవిపై అతను ఆసక్తి చూపకపోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా ఉన్న శశాంక్ మనోహర్ ఇండియాకు చెందినవాడే అయినప్పటికీ , బీసీసీఐ తో సరైన సఖ్యత లేనట్లు తెలుస్తుంది ..అక్టోబర్ లో ఐపీయల్ నిర్వహణను అడ్డుకునేందుకే ఐసీసీ టి ట్వంటీ వరల్డ్ కప్ వాయిదా గురించి ఇంకా ఎటువంటి ప్రకటన చేయడం లేదు అని బీసీసీఐ ఇటీవల ఆరోపించింది ..ఆస్ట్రేలియా ఆ వరల్డ్ కప్ నిర్వహించేందుకు సిద్ధంగా లేనప్పటికి ఐసీసీ చైర్మన్ గా ఉన్న శశాంక్ మనోహర్ వల్లనే ఆ టోర్నీ వాయిదా ప్రకటన ఆలస్యం అవుతుంది బీసీసీఐ పెద్దలు అంటున్నారు ..మరి ఇలాంటి పరిస్థిలో ఐసీసీ చైర్మన్ నియామకం ఇండియాకు కీలక కానుంది..

Tags :
|

Advertisement