Advertisement

  • ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులు అయిన ఐఏఎస్ ఆమ్రపాలి

ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులు అయిన ఐఏఎస్ ఆమ్రపాలి

By: Sankar Sun, 13 Sept 2020 09:20 AM

ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులు అయిన ఐఏఎస్ ఆమ్రపాలి


ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి మరోసారి ప్రమోషన్‌ దక్కింది... ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు ఆమ్రపాలి.. 2023 అక్టోబరు 10తేదీ వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం కేబినెట్ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఆమ్రపాలి.. ఇక, పీఎంవోలో అడుగుపెట్టనున్నారు. విశాఖలో పుట్టి ఆమె.. చెన్నై ఐఐటీ నుంచి పట్టాపుచ్చుకున్నారు.. ఇక, ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేశారు.. 2010 యూపీఎస్‌లో ఆలిండియా 39వ ర్యాంక్‌ను సాధించి, తెలంగాణ కేడర్‌కు ఎంపికయ్యారు. 2013లో వికారాబాద్ సబ్-కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు..

రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, వరంగల్‌ కలెక్టర్‌గా, తెలంగాణ ఎన్నిక సంఘం అధికారిణిగా సేవలందించారు. ఇక, ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోయారు. యువ కలెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించారు ఆమ్రపాలి. ఇక, తాజాగా పీఎంవోలో నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమెకు అరుదైన అవకాశం దక్కింది.

Tags :
|

Advertisement