Advertisement

ఆ షాట్ ను బ్యాన్ చేయాలి ..ఇయాన్ చాపెల్

By: Sankar Sun, 06 Dec 2020 6:43 PM

ఆ షాట్ ను బ్యాన్ చేయాలి ..ఇయాన్ చాపెల్


మోడరన్ క్రికెట్ లో ఆటగాళ్లు విభిన్న రకాల షాట్లను వెలుగులోకి తెచ్చారు ..ఎబి డివిలియర్స్ అయితే గ్రౌండ్ కి నలుమూలల తిరుగుతూ షాట్లు ఆడుతుంటాడు...ఇక ఆస్ట్రేలియా జట్టులో అయితే మాక్స్ వెల్ , వార్నర్ వంటి వారు ఎక్కువ స్విచ్ హిట్ ఆడుతుంటారు ..అయితే ఈ స్విచ్ హిట్ షాట్ కు చరమగీతం పాడాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయపడ్డాడు.

గత కొన్ని రోజులుగా స్విచ్‌ హిట్‌ షాట్లపై పదే పదే వార్తలో నిలుస్తున్న చాపెల్‌.. ఒకవేళ ఆ షాట్లు ఆడితే దాన్ని డెడ్‌బాల్‌గా ప్రకటించాలని సూచించాడు. ఆసీస్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఈ తరహా షాట్లతో టీమిండియాతో జరుగుతున్న సిరీస్‌లో అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్విచ్‌ షాట్‌ అనేది బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని, ఇది సరికాదని ఇయాన్‌ చాపెల్‌ పేర్కొన్నాడు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోకు రాసిన ఒక కాలమ్‌లో స్విచ్‌ హిట్‌పై ఇయాన్‌ చాపెల్‌ ధ్వజమెత్తాడు..

స్విచ్‌ హిట్టర్లకు ఇది చాలా ప‍్రయోజనం చేకూరుస్తుంది. ఆ షాట్‌ను బ్యాన్‌ చేయడమే మార్గం. లేకపోతే ఆ బాల్‌ను డెడ్‌బాల్‌గా ప్రకటించాలి’ అని పేర్కొన్నాడు. ఇది ఫీల్డ్‌ అంపైర్లకు అదనపు పనిగా మారిపోతుందని అంతర్జాతీయ మాజీ అంపైర్‌ సైమన్‌ టైఫల్‌ పేర్కొన్నాడు.

Tags :
|

Advertisement