Advertisement

  • ఆస్ట్రేలియాతో సిరీస్ లో టీమిండియా మూడో పేస్ బౌలర్ అతడే ..ఇయన్ చాపెల్

ఆస్ట్రేలియాతో సిరీస్ లో టీమిండియా మూడో పేస్ బౌలర్ అతడే ..ఇయన్ చాపెల్

By: Sankar Fri, 11 Dec 2020 4:02 PM

ఆస్ట్రేలియాతో సిరీస్ లో టీమిండియా మూడో పేస్ బౌలర్ అతడే ..ఇయన్ చాపెల్


ఆస్ట్రేలియా పర్యటనలో టీం ఇండియా ఇప్పటికే వన్ డే , టి ట్వంటీ సిరీస్ లను పూర్తి చేసుకొని ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ కోసం ముమ్మర సాధన చేస్తుంది..అయితే ఈ సిరీస్ లో టీం ఇండియాను గాయాలు వేధిస్తున్నాయి..

స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరం అవ్వగా , ఇక సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గాయం కారణంగా సిరీస్ మొత్తానికే దూరం అయ్యాడు ..దీనితో షమీ , బుమ్రా లతో బంతిని పంచుకునే మూడో పేసర్ కోసం టీం ఇండియా ఉమేష్ , సిరాజ్ , సైని లను ఎంపిక చేసింది..

తొలి టెస్టుకి టీమిండియాలో మూడో పేసర్‌ అవసరం ఉందని.. ఇషాంత్‌ గైర్హాజరీలో అనుభవం దృష్యా ఉమేశ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని శాస్త్రి నాతో చెప్పాడు అని అన్నాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఇయన్ చాపెల్ . ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టులో మహ్మద్‌ షమీ, బుమ్రాలు కీలకంగా మారారని.. ఉమేశ్‌ లాంటి బౌలర్‌ ఉంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా తొలి టెస్టును డే నైట్‌లో ఆడడం సానుకూలాశంగా మారనుంది. ఒకవేళ భారత్‌ మొదటి బ్యాటింగ్‌ చేసి 300 పరుగులు సాధిస్తే గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి అని తెలిపాడు

Tags :
|

Advertisement