Advertisement

  • బుమ్రా ఒక అద్భుతం ..జాగ్రత్తగా కాపాడుకోవాలి ..ఇయాన్ బిషప్

బుమ్రా ఒక అద్భుతం ..జాగ్రత్తగా కాపాడుకోవాలి ..ఇయాన్ బిషప్

By: Sankar Sun, 05 July 2020 09:24 AM

బుమ్రా ఒక అద్భుతం ..జాగ్రత్తగా కాపాడుకోవాలి ..ఇయాన్ బిషప్



జస్ప్రీత్ బుమ్రా.. టీంలోకి వచ్చిన అతి కొద్దీ కాలంలోనే జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా ఎదిగాడు ..తన విభిన్న యాక్షన్ శైలితో ప్రత్యర్థుల భారతం పడుతున్నాడు .. ప్రత్యర్థి ఎంత గొప్ప ఆటగాడైన బుమ్రా బౌలింగ్ కు వస్తే అతడిని ఆచితూచి ఎదుర్కొంటారు ..ముఖ్యంగా డెత్ ఓవర్లలో ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో బుమ్రాను మించిన ఆటగాడు లేడు..అయితే టెస్ట్, వన్‌డే, టీ20.. ఇలా మూడు ఫార్మటు లలో అద్భుతంగా రాణిస్తున్న బుమ్రాను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు వెస్ట్ ఇండీస్ దిగ్గజ బౌలర్ ఇయన్ బిషప్ ...

బూమ్రా అపారమైన ప్రతిభగల బౌలర్ అని, అతడిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నాడు. ‘ప్రపంచంలోని అతి తక్కువ మేలైన బౌలర్లలో బూమ్రా ఒకడు. ఏ ఫార్మాట్లో అయినా సత్తా చాటగలడు. అయితే అన్ని మ్యాచ్‌లలో, అన్ని ఫార్మాట్లలో నిర్విరామంగా అతడిని ఆడించడం సరైన పద్ధతి కాదు. దీనివల్ల ఎక్కువకాలం ఆడలేకపోయే ప్రమాదం ఏర్పడుతుంది.

బూమ్రా లాంటి విలువైన ఆటగాళ్లను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి’ అంటూ బిషప్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కేవలం బూమ్రాపైనే ఆధారపడకుండా మిగతా బౌలర్లకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని భారత్‌కు సూచించారు.

Tags :
|
|

Advertisement