Advertisement

  • కోహ్లీకి బౌలింగ్ చేయడానికి భయపడను ..పాక్ యువ బౌలర్ నసీం షా

కోహ్లీకి బౌలింగ్ చేయడానికి భయపడను ..పాక్ యువ బౌలర్ నసీం షా

By: Sankar Tue, 02 June 2020 1:56 PM

కోహ్లీకి బౌలింగ్ చేయడానికి భయపడను ..పాక్ యువ బౌలర్ నసీం షా

ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీ..ఫార్మటు ఏదయినా , దేశం ఏదయినా కోహ్లీ చూయించినంత నిలకడ మరే ఆటగాడికి సాధ్యం కాదు ..కోహ్లీకి బౌలింగ్ చేయాలంటే బౌలర్లు కూడా వెనకడుగు వేస్తారు..అయితే కోహ్లీకి బౌలింగ్ వేయడానికి తాను ఏ మాత్రం భయపడను అంటున్నాడు పాకిస్థాన్ యువ బౌలర్ నసీం షా.. తాజాగా స్థానికంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ 17 ఏళ్ల యువ బౌలర్‌ ఆసక్తికర ముచ్చట్లు చెప్పాడు.


virat kohli,nasim sha,india,pakisthan,cricket , విరాట్ కోహ్లీ.నసీం షా, భారత్‌, పాకిస్తాన్‌ ,  టీమిండియా

భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే ఎప్పటికీ ప్రత్యేకమే. అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్‌ను తిలకిస్తారు. అందుకే భారత్‌-పాక్‌ మ్యాచ్‌తో ఆటగాళ్లు హీరోలు లేక విలన్లు అవ్వొచ్చు. టీమిండియాతో మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. భీకర బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన భారత్‌ జట్టుతో తలపడేందుకు సిద్దంగా ఉన్నాను. పాక్‌ అభిమానులు ఏ మాత్రం నిరుత్సాహపడని ప్రదర్శన చేస్తాను. పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి అంటే నాకు భయం లేదు కానీ గౌరవ ఉంది. అతడికి బౌలింగ్‌ చేసేందకు ఏ మాత్రం భయపడను, ధైర్యంగా బౌలింగ్‌ చేస్తాను’ అంటూ నసీమ్‌ షా పేర్కొన్నాడు.

ఇక 16 ఏళ్ల వయసులోనే టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నసీమ్‌.. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా కరాచీ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నసీమ్ రికార్డు నెలకొల్పాడు.

Tags :
|

Advertisement