Advertisement

  • ప్రభుత్వ ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కేలా చూస్తాను: శివరాజ్సింగ్ చౌహాన్

ప్రభుత్వ ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కేలా చూస్తాను: శివరాజ్సింగ్ చౌహాన్

By: chandrasekar Wed, 19 Aug 2020 3:54 PM

ప్రభుత్వ ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కేలా చూస్తాను: శివరాజ్సింగ్ చౌహాన్


మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కేలా చూస్తానని, ఇందుకుగాను న్యాయపరమైన చర్యలు చేపడుతానని ప్రకటించారు. రాష్ట్రంలోని వనరులు కూడా స్థానికులకే దక్కేలా చర్యలు చేపడుతానని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేయడంతోపాటు ట్వీట్‌ కూడా చేశారు.

మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కేలా చూడాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు చర్యలు చేపడుతాం. రాష్ట్రంలోని వనరులు కూడా తొలుత ఇక్కడ ఉన్నవాళ్లకే అందేలా చూస్తాం’ అని పేర్కొన్నారు.రాష్ట్ర అభివృద్ధిలో ఇక్కడి యువతను భాగస్వాములను చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.

చౌహాన్‌ ప్రకటనపై కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్‌ స్పందిస్తూ ‘మీ 15 ఏండ్ల పాలనలో రాష్ట్ర యువతను, విద్యార్థులను మోసం చేశారు. మళ్లీ ఇప్పుడు మోసం చేయడానికి ప్రయత్నించకండి’ అని సూచించారు.

త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చౌహాన్‌ ఉద్యోగాల ప్రకటన చేసినట్లు తెలుస్తున్నది. 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి బీజేపీలో చేరడం. మరో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికలు అవసరమయ్యాయి.

Tags :
|

Advertisement