Advertisement

  • సచిన్ అవుట్ నిర్ణయం నా కెరీర్లోనే బెస్ట్ ...అంపైర్ హార్పర్

సచిన్ అవుట్ నిర్ణయం నా కెరీర్లోనే బెస్ట్ ...అంపైర్ హార్పర్

By: Sankar Wed, 22 July 2020 10:43 AM

సచిన్ అవుట్ నిర్ణయం నా కెరీర్లోనే బెస్ట్ ...అంపైర్ హార్పర్



ఆస్ట్రేలియాతో 1999లో జరిగిన అడిలైడ్ టెస్టుని భారత అభిమానులు అంత సులువుగా మర్చిపోలేరు. దానికి కారణం వివాదాస్పదరీతిలో సచిన్ టెండూల్కర్ ఔటవడం. ఫాస్ట్ బౌలర్ మెక్‌గ్రాత్ సంధించిన షార్ట్ పిచ్ బంతి నుంచి తప్పించుకునే క్రమంలో టెండూల్కర్ కిందకి వంగా.. బంతి అనూహ్యంగా తక్కువ ఎత్తులో వచ్చి అతని భుజాలకి తాకింది. దాంతో.. ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం మెక్‌గ్రాత్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ హార్పర్ వేలెత్తేశాడు. అప్పటి వరకూ లెగ్ బిఫోర్ వికెట్‌ (ఎల్బీడబ్ల్యూ)‌ని చూసిన క్రికెట్ ప్రపంచం.. తొలిసారి షోల్డర్ బిఫోర్ వికెట్‌ (ఎస్‌బీడబ్ల్యూ)‌ని చూసింది. అయితే.. అది ఔటని తాను ఇప్పటికీ విశ్వసిస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో హార్పర్ ధీమా వ్యక్తం చేశాడు.

ఆ మ్యాచ్‌‌కి సచిన్ టెండూల్కరే భారత కెప్టెన్. అయినప్పటికీ.. నిష్పక్షపాతంగా ఔట్ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇప్పటికీ.. ఆ నిర్ణయం నాకు గుర్తొస్తుంటుంది. కానీ.. చెడ్డగా లేదా భయపడేలా మాత్రం కాదు. ఇంకా చెప్పాలంటే.. సచిన్ ఔట్ నిర్ణయం నా కెరీర్‌లో బెస్ట్‌గా చెప్పుకుంటా.

ఆ మ్యాచ్ తర్వాత కూడా భారత మ్యాచ్‌లకి నేను అంపైర్‌గా వ్యవహరించాను. కానీ.. సచిన్ ఎప్పుడూ ఆ ఔట్ గురించి నాతో చర్చించలేదు. బహుశా నిజమైన క్రీడాస్ఫూర్తి అంటే ఇదేనేమో..? మొత్తంగా కొన్నేళ్ల నుంచి నేను క్రికెట్ చూస్తున్నాను. కానీ.. సచిన్‌‌లా మరో క్రికెటర్ అలా ఔటవడాన్ని నేను మళ్లీ చూడలేదు’’ అని హార్పర్ వెల్లడించాడు.

Tags :
|

Advertisement