Advertisement

‘క‌ల‌ర్ ఫోటో’ రెండు సార్లు చూశాను...

By: chandrasekar Tue, 27 Oct 2020 03:10 AM

‘క‌ల‌ర్ ఫోటో’ రెండు సార్లు చూశాను...


సందీప్ రాజ్ దర్శకుడిగా సుహాస్, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం ‘కలర్ ఫోటో’. అమృత ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై గ‌తంలో ‘హృద‌య‌కాలేయం’, ‘కొబ్బరిమ‌ట్ట’ చిత్రాలు నిర్మించిన సాయి రాజేష్ ఈ సినిమాకు కథ అందించారు. అలాగే, బెన్నీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సునీల్ కీల‌క పాత్ర పోషించిన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 23న ‘ఆహా’లో విడుదలైంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన ఈ సినిమాకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల నుంచి మాత్రం ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ...హీరో నాని కాల్ చేసి, సినిమా బాగా తీసావు అని ప్రశంసించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయ‌న ‘క‌ల‌ర్ ఫోటో’ సినిమాను రెండు సార్లు చూశాను అని చెప్పడం చాలా సంశశంగా ఉంది. ర‌వితేజ‌, డైరెక్టర్ మారుతి, రాజమౌళి ఇలా ఇండ‌స్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సోష‌ల్ మీడియా ద్వారా అభినిందించ‌డం చాలా సంతోషంగా ఉంది. కొంద‌రు హీరోలు ఫోన్ చేసి త్వర‌లోనే క‌లుద్దాం అని చెప్పడం నాలో మరింత‌ ఆత్మ విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచింది. షార్ట్ ఫిలింస్ చేసేట‌ప్పుడు నేను చాలా లిమిటెడ్ క్రూతో వ‌ర్క్ చేశాను. ఫీచ‌ర్ ఫిలింస్‌కి వ‌చ్చేస‌రికి మాత్రం సెట్‌లో 80 నుంచి 100 మంది క్రూతో వ‌ర్క్ చేయాలి. చాలా మందికి డైరెక్టర్ ఎవ‌రో తెలీదు. ఇలాంటి కొన్ని కొత్త అనుభ‌వాలు నాకు ఎదురయ్యాయి. కానీ ఫీచ‌ర్ ఫిలిం తీయ‌డం వ‌ల్ల నాకు పీపుల్ మేనేజ్‌మెంట్ తెలిసింది. డైరెక్షన్ స్కిల్స్‌తో పాటు పీపుల్ మేనేజ్‌మెంట్ కూడా తెలిస్తేనే స‌రైన సినిమా తీయ‌గ‌ల‌ం అని తెలుసుకున్నాను.

‘క‌ల‌ర్ ఫోటో’ స్టోరీ అనుకొని.. దాన్ని డెవ‌ల‌ప్ చేసే క్రమంలో నేను క్లైమాక్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాను. క్లైమాక్స్ బాగుంటే సినిమాను ఆడియెన్స్ ఆదిరిస్తార‌నే న‌మ్మకం నాకు ఉంది. అందుకే క్లైమాక్స్ కొత్తగా ఉండేలా రెండు విధాలుగా తెర‌కెక్కించాను. ఫిక్షన్ క్లైమాక్స్, నాన్ ఫిక్షన్ క్లైమాక్స్ అంటూ రెండు ఎండింగ్స్ మా సినిమాలో ఉండేలా చూసుకున్నా. అది అడియెన్స్ క‌నెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. కాల భైర‌వ ఇచ్చిన సంగీతం గురించి వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న మ్యూజిక్ మా సినిమాకి పెద్ద ఎస్సెట్. అలానే మా ఇద్దరి జ‌ర్నీ ఎప్పటి నుంచో సాగుతోంది. ఇద్దరం చాలా కంఫ‌ర్ట్‌గా వ‌ర్క్ చేసుకోగ‌లిగాం అని దర్శకుడు సందీప్ రాజ్ పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement