Advertisement

  • జట్టులోనుంచి తప్పిస్తే ఏముంది .. పదేళ్లు ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్నాను ..సౌరవ్ గంగూలీ

జట్టులోనుంచి తప్పిస్తే ఏముంది .. పదేళ్లు ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్నాను ..సౌరవ్ గంగూలీ

By: Sankar Wed, 22 July 2020 6:18 PM

జట్టులోనుంచి తప్పిస్తే ఏముంది .. పదేళ్లు ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్నాను ..సౌరవ్ గంగూలీ



టీమిండియా దిగ్గజ ఆటగాడు , ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అప్పట్లో తనను అకస్మాత్తుగా టీం నుంచి తొలగించడం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.. 2005లో అతని కెప్టెన్సీలోనే జింబాబ్వే పర్యటనకి వెళ్లిన భారత జట్టు.. సిరీస్‌ని గెలిచి సొంతగడ్డపై సగర్వంగా అడుగుపెట్టింది. కానీ.. ఆ వెంటనే గంగూలీని కెప్టెన్సీ నుంచి తప్పించడం.. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే జట్టులోనూ అతనిపై వేటు పడటం చకచకా జరిగిపోయాయి. దానికి కారణం అప్పటి కోచ్ గ్రేగ్ ఛాపెల్ అనేది బహిరంగ రహస్యమే..

జట్టులో నాపై వేటు పడినా.. నేను ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నేను పరుగులు రాబట్టగలనని నాకు తెలుసు. అప్పటి కోచ్ గ్రేగ్ ఛాపెల్.. తన కెరీర్‌లో వసీమ్ అక్రమ్, మెక్‌గ్రాత్, షోయబ్ అక్తర్‌లాంటి బౌలర్లని ఎదుర్కోలేదు. కానీ.. నేను వారిని ఎదుర్కొని పరుగులు రాబట్టాను. ఒక్కసారి కాదు.. దాదాపు 10 ఏళ్లు టాప్ క్లాస్ బౌలర్లని ఎదుర్కొన్నాను. కాబట్టి.. మళ్లీ అవకాశం దొరికితే నిరూపించుకుంటానని నాకు తెలుసు. అయితే.. జట్టు నుంచి తప్పించడంపై మాత్రం అప్పట్లో చాలా బాధపడ్డాను. కానీ.. ఒక్క క్షణం కూడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు’’ అని గంగూలీ గుర్తు చేసుకున్నాడు.

భారత్ జట్టుకి దూకుడు నేర్పిన కెప్టెన్‌గా కితాబులు అందుకున్న గంగూలీ.. 2005లో కెప్టెన్సీతో పాటు జట్టులోనూ చోటు కోల్పోయాడు. కానీ.. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్‌లాడిన దాదా.. పరుగుల వరద పారించి మళ్లీ టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఆ తర్వాత 2008లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా దాదా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

Tags :

Advertisement