Advertisement

నాకు ఆ పదవిపై ఎటువంటి ఆసక్తి లేదు ...శరద్ పవార్

By: Sankar Mon, 28 Dec 2020 10:29 PM

నాకు ఆ పదవిపై ఎటువంటి ఆసక్తి లేదు ...శరద్ పవార్


యూపీఏ(యునైడెట్‌ ప్రోగ్రెసివ్‌ అలియాన్సెస్‌) అధ్యక్షుడిగా నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ బాధ్యతలు చేపట్టనున్నారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై శరద్‌ పవార్‌ స్పందించారు.

మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటానికి తనకు ఎలాంటి ఆసక్తి లేదని తేల్చిచెప్పారు. రైతుల ఉద్యమంపైనుంచి దృష్టిని మళ్లించటానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు. యూపీఏ అధ్యక్షుడిగా తన పేరు తెరపైకి రావటంపై ఆయన గతంలోనూ క్లారిటీ ఇచ్చారు..

కాగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కూడా యూపీఏ ఛైర్పర్సన్ పదవి మార్పుపై స్పందించాడు ..అదేమీ ప్రధాని పదవి కాదు దాని మీద ఇంత చర్చ అనవసరం ..కూటమిలో ఎవరికీ ఎక్కువ సీట్లు ఉంటె ఆ పార్టీకి చెందినవారే అధ్యక్ష పదవిని అధిస్టించడం ఆనవాయితీ అని చిదంబంరం అన్నారు...

అయితే శివసేన మాత్రం శరద్‌ పవార్‌వైపే మొగ్గుచూపుతోంది. దీనిపై కూడా పవార్‌ స్పందించారు. ఒకవేళ శివనసేన తన పేరును సూచిస్తే అది ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయం మాత్రమేనని, తనది కాదని పవార్ స్పష్టం చేశారు.

Tags :
|

Advertisement