Advertisement

  • ద్రవిడ్‌ లాంటి గొప్ప ఆటగాడితో కలిసి ఆడడం నాకు ఆనందం: సంజూ శాంసన్‌

ద్రవిడ్‌ లాంటి గొప్ప ఆటగాడితో కలిసి ఆడడం నాకు ఆనందం: సంజూ శాంసన్‌

By: chandrasekar Thu, 25 June 2020 6:40 PM

ద్రవిడ్‌ లాంటి గొప్ప ఆటగాడితో కలిసి ఆడడం నాకు ఆనందం: సంజూ శాంసన్‌


రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు సంజూ శాంసన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ లాంటి కెప్టెన్‌, కోచ్‌ ఉండడం తన అదృష్టమని అన్నాడు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు శాంసన్‌.

18 ఏండ్ల వయసులో ద్రవిడ్‌ లాంటి గొప్ప ఆటగాడితో కలిసి ఆడడం ఆనందంగా ఉందన్నాడు. ద్రవిడ్‌కు ఆటపై విశేషమైన పట్టు ఉందని పేర్కొంన్నాడు.

కెప్టెన్‌గా ఆయన ఎన్నో విజయాలు, వైఫల్యాను చవి చూశారని అన్నాడు. ఒక ఆటగాడికి ఎలాంటి ఆలోచనా దక్పథం ఉండాలి, గెలుపోటములను ఎలా స్వీకరించాలి అనే అంశాలు ద్రవిడ్‌కు బాగా తెలుసు అని వివరించాడు.

రాజస్థాన్‌ రాయల్స్‌, ఇండియా ఏ తరపున ఆడే సమయంలో క్రికెట్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ద్రవిడ్‌ వద్ద నేర్చుకున్నానని శాంసన్‌ తెలిపాడు.

ఏ సందేహమున్నా నేను ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని ద్రవిడ్‌ చెప్పేవాడని తెలిపాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టులో ఆడడం తనకు ఎంతో సంతోషంగా ఉందని శాంసన్‌ తెలిపాడు.

Tags :
|

Advertisement