Advertisement

  • టీంఇండియాలో చోటు మీద రైనా ఇక ఆశలు వదులుకోవాల్సిందే ..బ్రాడ్ హాగ్

టీంఇండియాలో చోటు మీద రైనా ఇక ఆశలు వదులుకోవాల్సిందే ..బ్రాడ్ హాగ్

By: Sankar Mon, 27 July 2020 6:57 PM

టీంఇండియాలో చోటు మీద రైనా ఇక ఆశలు వదులుకోవాల్సిందే ..బ్రాడ్ హాగ్



టీమిండియా స్టార్ ఆటగాడు సురేష్ రైనా టీమిండియా రీఎంట్రీ మీద ఏమైనా ఆశలు పెట్టుకుంటే వాటిని వదులుకోవాల్సిందే అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాగ్ హాగ్ .. ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. యువ క్రికెటర్ల వైపే ఎక్కువ మొగ్గుచూపుతుండటంతో రైనాకు చాన్స్‌ ఉండదన్నాడు. సాధారణంగా రైనా నాల్గో స్థానంలో బ్యాటింగ్‌ చేసేవాడని, ఇప్పుడు ఆ స్థానాన్ని శ్రేయస్‌ అయ్యర్‌ సమర్థవంతంగా భర్తీ చేస్తున్నాడన్నాడు. మరి ఇటువంటి తరుణంలో రైనా తన స్థానంపై ఆశలు పెట్టుకోవడం అనవసరమన్నాడు..

ఒకవేళ టీ20 ఫార్మాట్‌లో రైనా చాన్స్‌ కోసం యత్నిస్తే అప్పుడు శిఖర్‌ ధావన్‌ను రిజర్వ్‌ బెంచ్‌లో ఉండాల్సి ఉంటుందన్నాడు. ఇక్కడ కూడా రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లు ఓపెనింగ్‌ చేసి, ధావన్‌ జట్టులో లేని పక్షంలోనే రైనాకు అవకాశం వచ్చే చాన్స్‌ ఉంటుందన్నాడు. అది జరగడం అనేది ప‍్రస్తుతం పరిస్థితుల్లో లేదని హాగ్‌ అభిప్రాయపడ్డాడు. ఏ రకంగా చూసుకున్నా రైనా తిరిగి భారత జట్టులోకి వచ్చేందకు దారులు మూసుకుపోయాయని తన యూట్యూబ్‌ చానల్‌లో మాట్లాడిన హాగ్‌ స్పష్టం చేశాడు.

ఇక టీమిండియా లో తిరిగి స్థానం దక్కించుకునేందుకు రైనా తీవ్రంగా కష్టపడుతున్నాడు ..పంత్, షమీ లతో కలిసి తన టౌన్ లోనే తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు ..ఇప్పటికి ఐపీయల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడు అయినా రైనా , ఈ ఐపీయల్ లో అద్భుతంగా రాణిస్తే టీమిండియా లో చోటు మీద ఆశలు పెట్టుకోవచ్చు ..కాగా రైనా 2018 జూలై నుంచి రైనా తిరిగి అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్‌ ఆడలేదు

Tags :
|

Advertisement