Advertisement

  • ధోని మనసులో ఏముందో అతడికి మాత్రమే తెలుసు ..సురేష్ రైనా

ధోని మనసులో ఏముందో అతడికి మాత్రమే తెలుసు ..సురేష్ రైనా

By: Sankar Mon, 01 June 2020 3:22 PM

ధోని మనసులో ఏముందో అతడికి మాత్రమే తెలుసు ..సురేష్ రైనా

టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని , మరొక ఆటగాడు సురేష్ రైనా మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే ..రైనా ఫామ్ లో లేనప్పుడు కూడా ధోని రైనాకు మద్దతు గా ఉండే వాడని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ అన్నాడంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఎంత బంధం ఉందొ తెలుస్తుంది ..అయితే ధోని రిటైర్మెంట్ గురించి మాత్రం తనకు తేలేదు అని అన్నాడు ఈ స్టార్ ఆటగాడు

భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో ఇంటర్వ్యూలో రైనా మాట్లాడుతుండగా.. ‘‘ధోనీ రిటైర్మెంట్ ప్రణాళికల గురించి నీకు ఏమైనా ఐడియా ఉందా..?’’ అని చోప్రా ప్రశ్నించాడు. దాంతో.. రైనా మాట్లాడుతూ ‘‘రిటైర్మెంట్ అనేది ధోనీ వ్యక్తిగత నిర్ణయం. ఆ విషయాల్ని నేను అడగలేను. అయినా.. ధోనీ ఇప్పటికీ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. కొత్త తరహా షాట్స్ కూడా ఆడుతున్నాడు. అతని బుర్రలో ఏ ఆలోచన ఉందో ఎవరికి తెలుసు..?’’ అని చెప్పుకొచ్చాడు.

dhoni,retirement,suresh raina,indian cricket,csk , ధోని,సురేష్ రైనా, ఆకాశ్ చోప్రా, రిటైర్మెంట్ ,వ్యక్తిగత నిర్ణయం


టీమిండియా కెప్టెన్‌గా ధోనీ ఉన్న రోజుల్లో సురేశ్ రైనాకి టీమ్‌లో స్థానానికి ఢోకా ఉండేది కాదు. కానీ.. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా మారిన తర్వాత క్రమంగా జట్టుకి దూరమైన రైనా.. ఇప్పుడు రీఎంట్రీ కోసం గత ఏడాదన్నరకాలంగా ఎదురుచూస్తున్నాడు. అయితే.. ఐపీఎల్‌లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో సుదీర్ఘకాలంగా ధోనీతో కలిసే రైనా మ్యాచ్‌లు ఆడుతున్నాడు.

Tags :
|

Advertisement