Advertisement

  • ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని సెలెక్టర్లు భావించారు..కానీ నేను అడ్డుపడ్డాను..శ్రీనివాసన్

ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని సెలెక్టర్లు భావించారు..కానీ నేను అడ్డుపడ్డాను..శ్రీనివాసన్

By: Sankar Tue, 18 Aug 2020 07:28 AM

ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని సెలెక్టర్లు భావించారు..కానీ నేను అడ్డుపడ్డాను..శ్రీనివాసన్


మహేంద్ర సింగ్ ధోని ..ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే గాక ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్ లలో ముందు వరుసలో ఉండే ఆటగాడు..ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలు దక్కించుకున్న ఆటగాడు..అయితే ఇన్ని ఘనతలు ఉన్న ధోనిని కూడా కెప్టెన్సీ నుంచి తప్పించాలని సెలెక్ట్ భావించారు..అయితే ఆలా తప్పించకుండా అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ అడ్డుపడ్డాడు ..ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా వెల్లడించాడు.

2011 సంవత్సరం... ఎమ్మెస్‌ ధోని నాయకత్వంలో భారత జట్టు వన్డే వరల్డ్‌ కప్‌ గెలుచుకొని నీరాజనాలందుకుంది. కెప్టెన్‌గా ధోని శిఖరాన నిలిచాడు. అయితే ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇంగ్లండ్‌ చేతిలో 0–4తో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా... ఆ తర్వాత కొద్ది రోజులకే ఆస్ట్రేలియా చేతిలో కూడా ఇదే తరహాలో 0–4తో పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ సమయంలో ధోని నాయకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో టెస్టు సిరీస్‌ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం ధోనిని కెప్టెన్సీనుంచి తప్పించాలని సెలక్టర్లు భావించారు..

అయితే శ్రీనివాసన్ తన విశేషాధికారాలు ఉపయోగించి ధోనిని కెప్టెన్‌గా కొనసాగేలా చేశారు. ఈ విషయంలో శ్రీనివాసన్‌ పాత్రపై అనేక సార్లు వార్తలు వచ్చినా... ఇంత కాలం ఆయన నోరు విప్పలేదు. ఇప్పుడు ధోని రిటైర్మెంట్‌ అనంతరం దీనిని శ్రీనివాసన్‌ ధ్రువీకరించారు. తానే ఎమ్మెస్‌ కెప్టెన్సీ కోల్పోకుండా ఆపినట్లు వెల్లడించారు. ఐపీఎల్‌ ప్రారంభమైన తొలి ఏడాది 2008నుంచే శ్రీనివాసన్‌కు చెందిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ కెప్టెన్‌గా ధోని వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డునుంచి జరిగే ప్రతీ ఎంపికకు అధ్యక్షుడు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ‘ధోనిని వన్డే జట్టు కెప్టెన్సీనుంచి తొలగించాలని ఒక సెలక్టర్‌ (మొహీందర్‌ అమర్‌నాథ్‌) భావించారు. అసలు అతడిని ఎలా తప్పించగలరనేదే నా ప్రశ్న. కొన్నాళ్ల క్రితమే ధోని ప్రపంచ కప్‌ గెలిపించాడు.

అసలు అతని స్థానంలో ఎవరిని కెప్టెన్‌ చేయాలో కూడా వారికి తెలీదు. అసలు సమావేశానికి ముందు నేను ధోని కెప్టెన్‌ కాకపోవడం అనే మాటే ఉదయించదని స్పష్టంగా చెప్పేశాను. సెలవు రోజున నేను గోల్ఫ్‌ ఆడుతున్న సమయంలో అప్పటి బోర్డు కార్యదర్శి సంజయ్‌ జగ్దాలే నాకు ఈ విషయం తెలియజేశారు. సెలక్టర్లు ఇంకా కెప్టెన్‌ ఎంపిక చేయలేదు. ధోనిని ఆటగాడిగా మాత్రమే తీసుకుంటామంటున్నారని నాతో ఆయన చెప్పారు. నేను వెంటనే నాకున్న అన్ని అధికారాలను ఉపయోగించాను’ అని శ్రీనివాసన్‌ గుర్తు చేసుకున్నారు. ధోని తనకు నచ్చినంత కాలం చెన్నై జట్టు తరఫున ఆడవచ్చని ఆయన హామీ ఇచ్చారు.

Tags :
|

Advertisement