Advertisement

  • నాకు ఒక చిన్న కారు మాత్రమే ఉంది ..అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న ..అనిల్ అంబానీ

నాకు ఒక చిన్న కారు మాత్రమే ఉంది ..అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న ..అనిల్ అంబానీ

By: Sankar Sat, 26 Sept 2020 4:28 PM

నాకు ఒక చిన్న కారు మాత్రమే ఉంది ..అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న ..అనిల్ అంబానీ


రిల‌య‌న్స్ గ్రూపు చైర్మ‌న్ అనిల్ అంబానీ మూడు చైనా కంపెనీల‌కు సుమారు 717 మిలియ‌న్ల డాల‌ర్లు బాకీ ఉన్నారు. అయితే ఆ కంపెనీలు అనిల్‌పై కేసు వేశాయి. లండ‌న్ కోర్టులో ఇవాళ ఆ కేసు విచార‌ణ సాగింది. వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా అనిల్ ఆ కేసు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

తానో సాధార‌ణ వ్య‌క్తిని అని, త‌న కోరిక‌లు కూడా సాధార‌ణ‌మే అని, న్యాయ‌వాదుల‌కు ఫీజు చెల్లించేందుకు న‌గ‌ల‌ను అమ్మిన‌ట్లు అనిల్ కోర్టుకు చెప్పారు. చైనా కంపెనీల‌కు భారీ రుణాల‌ను ఎగ‌వేసి చాలా సంప‌న్న‌మైన జీవితాన్ని గ‌డుపుతున్న‌ట్లు కోర్టు ఆయ‌న్ను ప్ర‌శ్నించింది. అయితే త‌న లైఫ్‌స్ట‌యిల్‌పై వ‌స్తున్న వార్త‌ల‌ను ఆయ‌న కొట్టిపారేశారు. త‌న‌కు రోల్స్ రాయ్స్ కారు లేద‌ని, త‌న వ‌ద్ద ఒకే ఒక చిన్న కారు ఉన్న‌ట్లు అనిల్ చెప్పారు. ఇంట్లో న‌గ‌ల‌ను అమ్మితే కేవ‌లం 9.9 కోట్లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

ఇండ‌స్ట్రియ‌ల్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా డెవ‌ల‌ప్మెంట్ బ్యాంక్‌, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు అనిల్ అంబానీపై కేసు దాఖ‌లు చేశాయి. 925 మిలియ‌న్ల డాల‌ర్ల రుణంపై అనిల్ 680 మిలియ‌న్ల డాల‌ర్ల‌కు వ్య‌క్తిగ‌త పూచీక‌త్తు ఇచ్చారు. ఆ కేసులో లండ‌న్ కోర్టు ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది.

Tags :

Advertisement