Advertisement

  • నేను బాగానే ఉన్నాను.. నేను బాగండాలని ప్రార్ధించిన మీ అందరికి ధన్యవాదాలు: కపిల్ దేవ్

నేను బాగానే ఉన్నాను.. నేను బాగండాలని ప్రార్ధించిన మీ అందరికి ధన్యవాదాలు: కపిల్ దేవ్

By: chandrasekar Sat, 24 Oct 2020 09:37 AM

నేను బాగానే ఉన్నాను.. నేను బాగండాలని ప్రార్ధించిన మీ అందరికి ధన్యవాదాలు: కపిల్ దేవ్


దేశానికీ వరల్డ్ కప్ అందించిన మొదటి కెప్టెన్ కపిల్ దేవ్ సోషల్ మీడియాలో తన ఆరోగ్యం గురించి వివరాలు పంచుకున్నారు. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అస్వస్థతకు గురయ్యారనే వార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఆయన క్షేమంగా ఉండాలని ముక్తకంఠంతో ప్రార్ధించింది. అయితే తాను బాగానే ఉన్నానని కపిల్ దేవే ప్రకటించాడు. ఇన్‌స్టా స్టోరీలో తన హెల్త్ అప్‌డేట్ ఇస్తూ శ్రేయోభిలాషులందరికి కృతజ్ఞతలు తెలిపారు. నేను బాగండాలని ప్రార్ధించిన మీ అందరికి ధన్యవాదాలు. మీ విషెస్‌లో నేను తడిసి ముద్దయ్యాను. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నాను. అని పేర్కొన్నారు. అర్ధారాత్రి గుండె పోటు రావడంతో ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరిన కపిల్ దేవ్‌కు యాంజియోప్లాస్టీ చికిత్స చేశామని, అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఛాతినొప్పితో కపిల్‌దేవ్‌ గురువారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు యాంజీయోప్లాస్టీ చికిత్స అందించాం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో డిశ్ఛార్జ్‌ చేస్తాం అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

భారత దేశానికి ప్రపంచకప్‌ అందించిన తొలి కెప్టెన్‌గా కపిల్‌దేవ్‌ చరిత్ర సృష్టించారు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన జట్టును 1983లో విశ్వవిజేతగా నిలపడంలో ఈ హరియాణా హరికేన్ ది కీలక పాత్ర. 61 ఏళ్ల కపిల్‌దేవ్‌ భారత్‌ తరఫున 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5248 పరుగులతో పాటు 434 వికెట్లు తీశాడు. వన్డేల్లో 3783 పరుగులు, 253 వికెట్లు సాధించాడు. కపిల్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, మాజీలు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేశారు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, మాజీ క్రికెటర్‌ మదన్‌లాల్‌ ట్వీట్‌లు చేశారు. టేక్‌ కేర్‌ కపిల్‌దేవ్‌! మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. గెట్‌వెల్‌ సూన్‌ పాజీ! అని సచిన్‌ టెండూల్కర్ ట్వీట్ చేయగా మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. గెట్‌ వెల్‌ సూన్‌ పాజీ. అని విరాట్‌ కోహ్లీ ఆకాక్షించాడు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను కపిల్‌ సర్‌.. టేక్ కేర్‌, గాడ్‌ బ్లెస్‌ అంటూ సురేశ్‌ రైనా ట్వీట్ చేశాడు. ఇలా సోషల్ మీడియాలో అందరూ అభిమానులు తమ ఆకాంక్షను తెలిపారు.

Tags :
|

Advertisement