Advertisement

  • ఆ ఆటగాడిని చూస్తే సంతోషంగా అనిపిస్తుంది ...హర్భజన్ సింగ్

ఆ ఆటగాడిని చూస్తే సంతోషంగా అనిపిస్తుంది ...హర్భజన్ సింగ్

By: Sankar Tue, 08 Dec 2020 09:12 AM

ఆ ఆటగాడిని చూస్తే సంతోషంగా అనిపిస్తుంది ...హర్భజన్ సింగ్


ఐపీయల్ ల్లో సత్తా చాటి ఇండియన్ టీంలోకి అరంగేట్రం చేసిన యువ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు...తాజాగా నటరాజన్ పై టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు ...

ఆసీస్‌ పర్యటనలో అద్భుతంగా ఆకట్టుకుంటున్న ఈ లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌(టీ20) అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ‘‘ఆసీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అదే జరిగితే తనతో పాటు జట్టులో కూడా సరికొత్త ఉత్సాహం నిండుతుంది. టీమిండియాకు తనొక ప్లస్‌. తనది గొప్ప కథ’’ అని భజ్జీ కొనియాడాడు..

తనను చూస్తుంటే సంతోషంగా ఉంది. వ్యక్తిగత జీవితంలో కష్టాలు అధిగమించిన తీరు, ప్రస్తుతం ఆసీస్‌ టూర్‌లో అదరగొడుతున్న విధానం అద్భుతం. కష్టపడి పనిచేస్తూ, మనల్ని మనం నమ్ముకుంటే జీవితంలో అనుకున్నవి సాధించగలమని అతడు నిరూపించాడు. ఈ సిరీస్‌లో తనే బ్రిలియంట్‌ బౌలర్‌. తనొక ముఖ్యమైన పిల్లర్‌. అవసరమైన సమయంలో వికెట్లు తీసి సత్తా చాటుతున్నాడు అని బజ్జి అభిప్రాయపడ్డాడు

Tags :

Advertisement