Advertisement

  • అల్లు అర్జున్ నా ఫేవరేట్ నటుడు ...భారత యువ మహిళా క్రికెటర్

అల్లు అర్జున్ నా ఫేవరేట్ నటుడు ...భారత యువ మహిళా క్రికెటర్

By: Sankar Fri, 20 Nov 2020 4:21 PM

అల్లు అర్జున్ నా ఫేవరేట్ నటుడు ...భారత యువ మహిళా క్రికెటర్


స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కి దక్షిణాదిన మాత్రమే కాదు ఉత్తరాదిన కూడా మంచి క్రేజ్ ఉంది. తనదైన స్టైల్‌, యాక్టింగ్‌, డ్యాన్స్‌తో ఉత్తరాదిన కూడా అభిమానులను సంపాదించుకున్నారు బన్నీ. ఈ క్రమంలో పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా బన్నీ అభిమానుల లిస్ట్‌లో ఉన్నారు. వారిలో టీమిండియా మహిళా క్రికెటర్‌ ప్రియా పునియా కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమే వెల్లడించారు..

ఇటీవల సోషల్‌ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించిన ప్రియా.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన దక్షిణాది నటుడు అల్లు అర్జున్‌ అని చెప్పుకొచ్చారు. అలాగే తనకు ఇష్టమైన రాజస్థానీ వంటకం చూర్మా లడ్డూ అని పేర్కొన్నారు.

ఇక క్రికెట్‌లో రాహుల్‌ ద్రావిడ్‌, విరాట్‌ కోహ్లీ తనకు ఆదర్శమని ఈ యువ క్రికెటర్‌ చెప్పుకొచ్చారు. కాగా 2016లో ఢిల్లీ తరఫున మెరిసిన పునియా.. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు ఇండియా తరఫున ఆమె 5 వన్డేలు, 3 టీ20లు ఆడారు.

Tags :

Advertisement