Advertisement

  • హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ ప్రచారంతో రికార్డు స్థాయిలో మందు అమ్మకాలు

హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ ప్రచారంతో రికార్డు స్థాయిలో మందు అమ్మకాలు

By: Sankar Sun, 05 July 2020 11:36 AM

హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్  ప్రచారంతో రికార్డు స్థాయిలో మందు అమ్మకాలు



దేశం ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మందు బాబులు మందు తాగకుండా ఉండలేరు ..కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ను తొలిసారి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అకస్మాతుగా ప్రకటించారు గాని లేకుంటే మందు బాబులు ముందుగానే నెల రోజులకు సరిపడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునే వారు ..అయితే ఇటీవల మళ్లీ కరోనా కేసులు తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో హైదరాబాద్ లో తిరిగి లాక్ డౌన్ పెడతారు అని ప్రచారం ఊపందుకుంది ..

దీనితో జూలై 1 నుంచి లాక్‌డౌన్‌ విధిస్తే, ఎక్కడ షాపులు మూతపడతాయేమోనన్న కంగారుతో మందుబాబులు పెద్ద మొత్తంలతో మద్యం కొని నిల్వ చేసుకున్నారు. మొత్తమ్మీద కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాలు బాసటగా నిలుస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు, జీఎ్‌సటీ రాబడుల కంటే మద్యం విక్రయాలే ఎక్కువ ఊరట కలిగిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4997.81 కోట్ల రాబడి సమకూరింది. జూన్‌ నెలాఖర్లో అమ్మకాలు గణనీయంగా పెరగ్గా ఈ నెల 1 నుంచి 4 వరకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే అమ్మకాలున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత మే 6 నుంచి 31 వరకు సాగిన విక్రయాల్లో రూ.1864 కోట్ల రాబడి వచ్చింది. జూన్‌లో రూ.1955 కోట్ల ఆదాయం సమకూరింది. జూన్‌ 26 నుంచి 30 మధ్య రూ.973.61 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.

హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మద్యం దొరక్క ఎదుర్కొన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మందు బాబులు మద్యం కొనుగోలు కోసం ఎగబడ్డారు. సాధారణ రోజుల్లో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం డిపోల నుంచి వైన్‌ షాపు ఓనర్లు రోజుకు రూ.70-75 కోట్ల మద్యం, బీరును లిఫ్ట్‌ చేస్తుంటారు. కానీ జూన్‌ 26 నుంచి 30వ తేదీ వరకు 27న మినహా మిగతా నాలుగు రోజుల్లో రూ.150 కోట్లకు పైగానే విక్రయాలు సాగాయి. ఇక జూలై 1 నుంచి 4 వరకు కూడా విక్రయాలు బాగానే ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రతి రోజూ రూ.75 కోట్లకు పైగానే విక్రయాలు సాగడం గమనార్హం.

Tags :
|

Advertisement