Advertisement

  • బెంగళూరు పై విజయంతో సెకండ్ క్వాలిఫైయర్ ఆడనున్న హైదరాబాద్

బెంగళూరు పై విజయంతో సెకండ్ క్వాలిఫైయర్ ఆడనున్న హైదరాబాద్

By: chandrasekar Sat, 07 Nov 2020 2:12 PM

బెంగళూరు పై విజయంతో సెకండ్ క్వాలిఫైయర్ ఆడనున్న హైదరాబాద్


సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఐపీఎల్ 2020 సీజన్‌ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ నిష్క్రమించింది. అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 132 పరుగుల లక్ష్యాన్ని కేన్ విలియమ్సన్ (50 నాటౌట్: 44 బంతుల్లో 2x4, 2x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ 132/4తో ఛేదించేసింది.

రానున్న ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో అబుదాబి వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ తో హైదరాబాద్ తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే మంగళవారం దుబాయ్‌లో ముంబయి ఇండియన్స్‌తో తుది పోరులో ఢీకొట్టనుంది. మ్యాచ్‌లో అంతకముందు ఫాస్ట్ బౌలర్లు జేసన్ హోల్డర్ (3/25), నటరాజన్ (2/33) దెబ్బకి టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 131 పరుగులకే పరిమితమైంది. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది.

బెంగళూరు జట్టులో ఏబీ డివిలియర్స్ (56: 43 బంతుల్లో 5x4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (6: 7 బంతుల్లో), మంచి ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (1: 6 బంతుల్లో), అరోన్ ఫించ్ (32: 30 బంతుల్లో 3x4, 1x6), మొయిన్ అలీ (0), శివమ్ దూబే (8), వాషింగ్టన్ సుందర్ (5) తేలిపోయారు. అయినప్పటికీ ఒక ఎండ్‌లో ఓపికగా ఆడిన డివిలియర్స్ బెంగళూరుకి ఆ మాత్రం స్కోరైనా అందించాడు. లేకుంటే ఇంకా తక్కువ స్కోరుకే ముగించుండేది.

Tags :

Advertisement