Advertisement

మెడ్ టెక్ హబ్ గా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌

By: Dimple Wed, 12 Aug 2020 00:45 AM

మెడ్ టెక్ హబ్ గా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌

మెడికల్ విడి భాగాల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మెడ్‌ట్రోనిక్ తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకుంది. అమెరికా బయట మెడ్‌ట్రోనిక్‌కు అతిపెద్ద ఆర్అండ్‌డీ సెంటర్ ఇదే కావడం విశేషం. ఇందుకోసం సుమారు రూ.1200 కోట్లతో తన ప్రస్తుత కార్యకలాపాలను తెలంగాణలో నెలకొల్పనుంది. ప్రస్తుతం ఉన్న తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని మరింతగా విస్తరించనుంది. ఈ పెట్టుబడితో మెడికల్ డివైసెస్ హబ్‌గా హైదరాబాద్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. మంగళవారం నాడు జరిగిన వర్చువల్ మీటింగ్‌లో భాగంగా కేటీఆర్.. మెడ్‌ట్రోనిక్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను వివరించారు.
మెడ్‌ట్రోనిక్ కంపెనీ హైదరాబాద్ నగరాన్ని తమ అతిపెద్ద ఆర్‌అండ్‌డి సెంటర్‌కి గమ్యస్థానం ఎంచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ విడిభాగాల రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ పెట్టుబడితో మెడ్‌‌టెక్ హబ్‌గా హైదరాబాద్ మారుతుందని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. మరిన్ని పెట్టుబడులు, అనేక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. తన అమెరికా పర్యటనలో కంపెనీ చైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా ఒమర్‌కు అభినందనలు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు.
మెడ్ టెక్ రంగ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మెడ్‌ట్రోనిక్‌తో ఇప్పుడు జరుగుతున్న ఒప్పందమే ఇందుకు నిదర్శనమని మంత్రి తెలిపారు. మెడికల్ డివైసెస్ కంపెనీలతో కలిసి పనిచేస్తూ ప్రపంచ ఆరోగ్య రంగంలో సానుకూల మార్పు దిశగా పని చేస్తామని మంత్రి అన్నారు. ఈ పెట్టుబడి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పనతో పాటు, ఈ రంగంలో మరిన్ని నూతన పెట్టుబడులు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

Advertisement