Advertisement

  • అంబులెన్సు ముందు పరుగెత్తుతూ దారి ఇచ్చేలా చేసిన కానిస్టేబుల్...

అంబులెన్సు ముందు పరుగెత్తుతూ దారి ఇచ్చేలా చేసిన కానిస్టేబుల్...

By: Sankar Wed, 04 Nov 2020 7:34 PM

అంబులెన్సు ముందు పరుగెత్తుతూ దారి ఇచ్చేలా చేసిన కానిస్టేబుల్...


ప్రాణాపాయ స్థితిలో ఓ వ్యక్తిని తీసుకెళుతున్న అంబులెన్సును ఆసుపత్రికి చేర్చి మానవత్వం చాటుకున్నాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్.

హైదరాబాద్ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేసే బాబ్జి.. నిత్యం రద్దీగా ఉండే మొజంజాహి మార్కెట్ నుండి కోఠి వెళ్లే దారిలో ఓ అంబులెన్స్‌ ట్రాఫిక్ లో చిక్కుకోవడం గమనించాడు. వెంటనే దానికి దారి క్లియర్ చేయాలనుకున్నాడు. పరిగెడుతూ ఆ అంబులెన్స్ కు దారి క్లియర్ చేసాడు.

అయితే ప్రాణాపాయ స్థితిలో ట్రాఫిక్ లో చిక్కుకున్న వారు ఆసుపత్రికి చేరుకొని ప్రాణాప్రాయం నుండి బయటపడ్డారు. దీంతో వారి ప్రాణాలు కాపాడిన ఆ కానిస్టేబుల్ సహాయానికి కృతజ్ఞతగా ఆ వీడియో ను సోషల్ మీడియా లో పెట్టారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి పోలీస్ ఉన్నతాధికారులతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags :

Advertisement