Advertisement

  • హైదరాబాద్‌ పోలీసులు పాడిన ‘సింగం పోలీస్ వాలా’ సోషల్ మీడియాలో హల్చల్

హైదరాబాద్‌ పోలీసులు పాడిన ‘సింగం పోలీస్ వాలా’ సోషల్ మీడియాలో హల్చల్

By: chandrasekar Wed, 07 Oct 2020 1:59 PM

హైదరాబాద్‌ పోలీసులు పాడిన ‘సింగం పోలీస్ వాలా’ సోషల్ మీడియాలో హల్చల్


‘సింగం పోలీస్ వాలా’ పేరుతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పోలీసులు సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించారు. ఓల్డ్ సిటీ ఏఆర్‌హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న వీరు తమ ప్రతిభతో అందరి మనసులు ఆకట్టుకుంటున్నారు. ఈ పోలీసుల పేర్లు అశ్విన్, సంతోష్. ఓ వాహనంలో కూర్చొని ఇద్దరూ ర్యాప్ గీతాన్ని ఆలపించారు.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అత్యుత్తమైన ప్రతిభ కనబరుస్తూ వీరు పాటలు పాడుతున్నారు. ప్రస్తుతం ఈ పోలీసులు అశ్విన్, సంతోష్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సమయం దొరికినప్పుడు ఇద్దరూ ఇలా ర్యాప్ పాటలతో చుట్టూ ఉన్నవారిని ఉత్సాహపరుస్తున్నారు. ఈ వీడియోలో భాగంగా వారు తమ ప్రతిభను కూడా గుర్తించాలని కోరారు. ముఖ్యంగా ఇంగ్లీష్ పాట తరహాలో ఇద్దరు జవాన్లు పాడిన రాప్ గీతం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సింగం పోలీస్ వాలా సాంగ్స్ విని నెటిజన్లు ఆశ్చర్యచకితులవుతున్నారు. తెలుగు వారు అయి ఉండి ఇంగ్లీష్ రిథమ్‌లో తెలుగు పాడడటం మరింతగా ఆకట్టుకుంటోంది.

Tags :

Advertisement