Advertisement

పోలీసుల్లో కరోనా టెన్షన్...

By: Anji Thu, 27 Aug 2020 1:51 PM

పోలీసుల్లో కరోనా టెన్షన్...

తెలంగాణాలో కరోనా మహమ్మారిని అడ్డుకునే పోరులో ముందున్న పోలీసులు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పోలీస్ విభాగంలో వేలల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు 45 మంది పోలీసులు కరోనాతో ప్రాణాలు విడిచారు.
తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి.

ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటిన సంఖ్య మనకు తెలిసిందే. అయితే కరోనా పోరుపై ముందు వరుసలో ఉన్న పోలీస్ శాఖలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు అనేకమంది పోలీసులు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు తెలంగాణ పోలీస్ శాఖలో మొత్తం 5,684 పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో వీరిలో 2,284 మంది డిశ్ఛార్జి కాగా, 3,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు 45 మంది పోలీసులు కరోనాతో ప్రాణాలు విడిచారు.

telangana police,telangana state,corona virus,hyderabad,police commissionerate top place,corona cases in hyderabad,police fears to corona

కరోనా బారిన పడి చనిపోయిన వారిలో కానిస్టేబుల్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వరకు ఉన్నారు. తెలంగాణలో మొత్తం డిపార్ట్ మెంట్ లో 54 వేల మంది సిబ్బంది ఉన్నారు. వారిలో పది శాతం మందికి కరోన వైరస్ సోకింది. అయితే కరోనా కేసుల్లో హైదరాబాద్ కమిషనరేట్ టాప్ ప్లేసులో నిలిచింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,967 మంది కరోనా బారిన పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. అందులో 891 చికిత్స పొందుతుననారు. 1053 మంది రికవరీ అయ్యారు. 23 మంది కరోనాతో పోరాడి చనిపోయారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ 526 కేసులు ఉండగా, 361 మంది చికిత్స పొందుతున్నారు, 163 మంది డిశ్చార్జి, ఇద్దరు మరణించాు.
ఇటీవలే జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి కరోనాతో పోరాడి చనిపోయారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ వృత్తిపట్ల ఎంతో అంకిత భావంతో పని చేసే పోలీసులు ఇలా కరోనాతో చనిపోవడం తమను కలిచివేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తాజాగా తెలంగాణలో 2,797 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 1,14,483 కరోనా కేసులు నమోదు అవగా...మొత్తం 789 మరణాలు సంభవించాయి.

Tags :

Advertisement