Advertisement

  • భారత్ బంద్ కారణంగా హై అలెర్ట్ ప్రకటించిన హైదరాబాద్ పోలీసులు

భారత్ బంద్ కారణంగా హై అలెర్ట్ ప్రకటించిన హైదరాబాద్ పోలీసులు

By: Sankar Tue, 08 Dec 2020 11:07 AM

భారత్ బంద్ కారణంగా హై అలెర్ట్ ప్రకటించిన హైదరాబాద్ పోలీసులు


నేడు భారత్ బంద్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల హై అలర్ట్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఐదు జోన్‌లకు ముగ్గురు సీపీలను, ఇద్దరు జాయింట్ సీపీలను ఇంచార్జ్‌లుగా నియమించారు.

బంద్ కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలుగకుండా చూసుకోవాలని పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. అంతేకాకుండా అత్యవసర వాహనాలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని డీజీపీ తెలిపారు. పాత బస్తీలోని వ్యాపారులు స్వచ్చందంగా ఫాపులను మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు.

తెలంగాణలో భారత్ బంద్‌కు కేవలం టీఆర్ఎస్ కాకుండా మిగిలిన పార్టీలు జనసమితి, ఎంఐఎం, కాంగ్రెస్‌లు కూడా మద్దతు తెలిపాయి. అయితే ఎటువంటి గొడవలు జరకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీ బందోబస్తును అమర్చారు. ఆర్‌టీసీ బస్సులను రోడ్డు మీదకు అనుమతి లకుండా, డిపోలలోనే ఉంచేశారు. ఇప్పటి వరకు భారత్ బంద్‌కు ఎటువంటి ఆటంకం రాలేదు.

Tags :
|
|

Advertisement