Advertisement

  • కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నా ..విధి వక్రీకరించింది ..గుండెపోటుతో హైదరాబాద్ డాక్టర్ మృతి

కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నా ..విధి వక్రీకరించింది ..గుండెపోటుతో హైదరాబాద్ డాక్టర్ మృతి

By: Sankar Thu, 12 Nov 2020 6:52 PM

కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నా ..విధి వక్రీకరించింది ..గుండెపోటుతో హైదరాబాద్ డాక్టర్ మృతి


హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన డాక్టర్ కిడ్నాప్ చివరికి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో సుఖాంతమైందని భావిస్తున్న తరుణంలో విధి వక్రీకరించింది.

కిడ్నాప్ టెన్షన్ కొనసాగుతుండడమో లేక మరేదైనా కారణమో కానీ ఆ డాక్టర్ గురువారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ షరీఫ్‌ను పది రోజుల క్రితం కిడ్నాప్ చేసి బెంగళూరు తరలిస్తుండగా..

పోలీసులు చాకచక్యంతో అనంతపురం జిల్లాలో పట్టుకున్నారు. డాక్టర్‌ను సేఫ్‌గా రక్షించామన్న ఆనందం ఎంతో కాలం నిలవలేదు. గురువారం ఆ డాక్టర్ గుండెపోటుతో మరణించారు.కిడ్నాపర్ల చెర నుంచి విముక్తుడైనప్పటికీ.. గత పది రోజులుగా డాక్టర్ షరీఫ్ చాలా డిప్రెషన్‌తో వుండేవాడని కుటుంబీకులు చెబుతున్నారు

Tags :
|

Advertisement