Advertisement

  • హైదరాబాద్ లో దీక్షిత్ తరహా సంఘటన ..కిడ్నాప్ అయిన బాలుడి శవం లభ్యం

హైదరాబాద్ లో దీక్షిత్ తరహా సంఘటన ..కిడ్నాప్ అయిన బాలుడి శవం లభ్యం

By: Sankar Mon, 26 Oct 2020 1:58 PM

హైదరాబాద్ లో దీక్షిత్ తరహా సంఘటన ..కిడ్నాప్ అయిన బాలుడి శవం లభ్యం


ఇటీవల తెలంగాణాలో కిడ్నప్ కేసులు ఎక్కువ అవుతున్నాయి ..దీక్షిత్ అనే చిన్నారి కిడ్నప్ అయి హత్యకు గురి అయిన విషయం మరువకముందే హైద్రాబాద్లో సరిగ్గా అలంటి సంఘటనే జరిగింది..ఈ నెల 15వ తేదీన ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే.

కిడ్నాప్ చేసిన వ్యక్తి బాలుడి తండ్రికి ఫోన్ చేసి రూ.15 లక్షలు ఇస్తేనే పిల్లాడు తిరిగి ఇంటికి వస్తాడని బెదిరించాడు. బాలుడి తండ్రి ఆటో డ్రవర్ కావడంతో అంత మొత్తం ఇచ్చుకోలేనని ఎంత ప్రాధేయపడినా ఆగంతకుడు వినిపించుకోలేదు. దాంతో ఆందోళన చెందిన తండ్రి స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు తమ దర్యాప్తు మొదలు పెట్టి, కొందరి అనుమానితులను విచారిస్తున్నారు.

అయితే కిడ్రాప్‌కు గురైన బాలుడు ఇటీవల శవమై కనిపించాడు. ఇందుకు ఇంటిలో కిరాయికి ఉంటున్నవారు పాల్పడి ఉండొచ్చని పోలీసులు వారిని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ అఘాయిత్యానికి పాల్పడినవారిని పట్టుకునేందు శాయిశక్తుల ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Tags :
|
|

Advertisement