Advertisement

  • దేశంలో అత్యధిక సీసీటీవీ కెమెరాలు ఉన్న నగరంగా హైదరాబాద్ రికార్డు ..

దేశంలో అత్యధిక సీసీటీవీ కెమెరాలు ఉన్న నగరంగా హైదరాబాద్ రికార్డు ..

By: Sankar Sun, 26 July 2020 9:22 PM

దేశంలో అత్యధిక సీసీటీవీ కెమెరాలు ఉన్న నగరంగా హైదరాబాద్ రికార్డు ..



దేశంలో హైదరాబాద్ నగరం మరో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అత్యధిక సీసీటీవీ కెమెరాలు కలిగి ఉన్న నగరాల జాబితాలో ఏకంగా తొలి స్థానంలో నిలిచింది. అంతేగాక, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సీసీటీవీ కెమెరాల నిఘా ఉన్న నగరాల్లోనూ తొలి 20 స్థానాల్లో చోటు దక్కించుకుంది. యూకేకు చెందిన కంపారిటెక్ అనే సంస్థ ఈ జాబితాను తయారు చేసింది. ఈ నివేదికను బుధవారం విడుదల చేసింది. ఇక వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్), యాంటీవైరస్ యాప్స్‌ వాడకంలో హైదరాబాద్‌లో ప్రపంచంలోనే 16వ స్థానంలో ఉంది.

కంపారిటెక్‌ సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం.. సర్వియలన్స్‌లో చైనా మొదటి స్థానంలో నిలిచింది. తొలి 20 నగరాల్లో 18 చైనాలోనివే కావడం విశేషం. ఈ జాబితాలో చైనాలోని తైయువాన్ నగరం తొలి స్థానం దక్కించుకుంది. ఈ నగరంలో 4.65 లక్షల సీసీటీవీ కెమెరాలను అమర్చగా.. వాటి ద్వారా నిఘా ఉంచుతున్నారు.

ఇక 3 లక్షల సీసీటీవీ కెమెరాల వినియోగంతో హైదరాబాద్‌ 15వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ నగరంలో ప్రతి వెయ్యి మందికి సరాసరిన 29.99 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. సర్వియలన్స్‌ విషయంలో చెన్నై 21, దిల్లీ 33 స్థానాలు దక్కించుకున్నాయి.

Tags :
|
|
|

Advertisement