Advertisement

తెలంగాణాలో కరోనాతో హెడ్ నర్స్ మరణం

By: Sankar Fri, 26 June 2020 7:40 PM

తెలంగాణాలో కరోనాతో హెడ్ నర్స్ మరణం



కరోనా ప్రాణాలను కబళిస్తుంది అని తెలిసి కూడా డాక్టర్లు , నర్సులు , పోలీసులు మరియు పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి పోరాడుతున్నారు ..ఇందులో అనేక మంది కరోనా బారిన పడ్డారు అందులో కొందరు చనిపోయారు కూడా మరి కొంతమంది వైరస్ తో పోరాడి జయించారు ..అయితే తాజాగా ఒక హెడ్ నర్స్ కరోనా తో పోరాడుతూ ప్రాణాలు విడిచింది..

కరోనా సంక్షోభంలో నిరంతరం శ్రమిస్తున్న ఆమెను ఈలోపే కరోనా వైరస్ కబళించుకుపోవడం విషాదం కలిగిస్తోంది. ఈ నర్సు హైదరాబాద్‌లోని ఛాతీ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. కరోనా సోకడంతో కొద్ది రోజులుగా నర్సు చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూనే ఆమె శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఈ నెలాఖరున ఈమె రిటైర్మెంట్ కాబోతున్న వేళ అర్ధంతరంగా కన్నుమూయడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

హెడ్ నర్సు కరోనాతో చనిపోవడాన్ని ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ ధ్రువీకరించారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ రాగానే హెడ్ నర్స్ భర్త హోం క్వారంటైన్‌కే పరిమితమయ్యారు. ఏళ్లుగా ఆస్పత్రిలో సేవలందిస్తున్న నర్సు కరోనాకు బలి కావడంతో తోటి వైద్య సిబ్బంది సైతం విషాదంలో మునిగిపోయారు.

Tags :
|
|
|

Advertisement