Advertisement

  • సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం - సీపీ అంజనీ కుమార్

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం - సీపీ అంజనీ కుమార్

By: Anji Thu, 03 Dec 2020 5:18 PM

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం - సీపీ అంజనీ కుమార్

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఒకే రోజు 92 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇదంతా తప్పుడు ప్రచారమని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కొట్టిపారేశారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించిన పోలీసులపై చర్యలంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.

పోలీసు అధికారుల సస్పెన్షన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని హైదరాబాద్ సీపీ తెలిపారు. ఒకేరోజు 92 మంది అధికారులను తొలగించారనే సోషల్ మీడియా పోస్టులను ఖండించారు.

Tags :

Advertisement