Advertisement

  • లాక్ డౌన్ తర్వాత తిరిగి తొలిసారి రోడ్డెక్కిన హైదరాబాద్ సిటీ బస్సులు

లాక్ డౌన్ తర్వాత తిరిగి తొలిసారి రోడ్డెక్కిన హైదరాబాద్ సిటీ బస్సులు

By: Sankar Sat, 26 Sept 2020 06:46 AM

లాక్ డౌన్ తర్వాత తిరిగి తొలిసారి రోడ్డెక్కిన హైదరాబాద్ సిటీ బస్సులు


లాక్‌డౌన్‌తో సర్వం బంద్‌ కావడంతో.. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది.. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి... ఇక, సడలింపుల తర్వాత.. జిల్లా సర్వీసులు తిరిగినా హైదరాబాద్‌ సర్వీసులు మాత్రం రోడ్డెక్కలేదు.. ఇక మొన్నటి నుంచి సిటీ శివారు ప్రాంతాల్లో బస్సులు నడవగా.. ఇవాళ హైదరాబాద్‌లో బస్సులు రోడ్డెక్కాయి. దాదాపు అన్ని రూట్లలో 25శాతం బస్సులు ప్రారంభమయ్యాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొత్తం 29 బస్సు డిపోలుండగా.. 2,800 బస్సులున్నాయి. వీటిలో 25 శాతం బస్సులను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆపరేట్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రతీ డిపోకు 35 బస్సుల చొప్పున నడుపుతున్నారు. మొదటి రోజు తమకు కేటాయించిన వాటిలో సగం బస్సులను మాత్రమే రోడ్డెక్కించనున్నారు. సిటీ బస్సులతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా సర్వీసులను పునరుద్ధరించారు. ఏపీకి మాత్రం ఇంకా ప్రారంభించలేదు.

అసలే కరోనా కష్టకాలంలో ఆర్ధికంగా నష్టపోయిన అనేకమంది చిరు ఉద్యోగులు , చిరు వ్యాపారులు ఈ సిటీ బస్సులు లేకపోవడంతో గత నాలుగు అయిదు నెలలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు..మెట్రో ప్రారంభం అయినా కూడా మెట్రో చార్జీలు , సిటీ బస్సులతో పోలుచ్చుకుంటే చాల ఏక్కువగా ఉంటాయి..దీనితో తిరిగి సిటీ బస్సులు ప్రారంభం అవ్వడంపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Tags :
|

Advertisement