Advertisement

  • గ్లోబల్ ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

గ్లోబల్ ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

By: Sankar Mon, 09 Nov 2020 4:23 PM

గ్లోబల్ ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ


గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ గ్లోబల్‌ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించింది. ఆర్‌యూఆర్‌ ర్యాంకింగ్‌ ఏజెన్సీ, క్లెరివేట్‌ అనలైటిక్స్‌ సంయుక్తంగా నిర్వహించిన ఆర్‌యూఆర్‌ 2020 లైఫ్‌ సైన్సెస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా 800లకు పైగా యూనివర్సిటీల్లో టీచింగ్‌, రీసెర్చ్‌, ఇంటర్నేషనల్‌ డైవర్సిటీ, ఫైనాన్షియల్‌ సస్టేనబిలిటీ అంశాలను పరిగణలోకి తీసుకుని సర్వేని నిర్వహించారు.

కాగా భారతదేశంలోని 13 యూనివర్సిటీల్లో హెచ్‌సీయూ 7వ స్థానంలో ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా 829 యూనివర్సిటీల్లో 363వ స్థానంలో నిలిచినట్లు వర్సిటీ వీసీ పీ అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 365 అంతర్జాతీయ యూనివర్సిటీల్లో ఒకటిగా హెచ్‌సీయూ నిలుస్తుందన్నారు.

టాప్‌ 75 టీచింగ్‌ యూనివర్సిటీల్లో ఒకటిగా నిలిచిందన్నారు. వర్సిటీలోని నైపుణ్యలైన అధ్యాపకులు మెరుగైన పరిశోధకులను తయారు చేస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటుగా యువ అధ్యాపకులను నిపుణులుగా తయారు చేసేందుకు దోహదపడుతుందన్నారు.


Tags :
|

Advertisement