Advertisement

  • తెరాస పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది ..మంత్రి సత్యవతి రాథోడ్

తెరాస పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది ..మంత్రి సత్యవతి రాథోడ్

By: Sankar Fri, 20 Nov 2020 4:32 PM

తెరాస పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది ..మంత్రి సత్యవతి రాథోడ్


హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుతూ హిందూ- ముస్లిం భాయి భాయిగా ఉండేలా సీఎం కేసీఆర్ పాలిస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ని ప్రకటించడంతో ఆమె నామినేషన్ దాఖలు ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భందా మంత్రి మాట్లాడుతూ..గతంలో ఉప్పల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన డివిజన్ ఇది. ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీ తో గెలవబోతున్నదని జోస్యం చెప్పారు.

బీజేపీ నాయకులు వాళ్ల స్థాయికి మించి మాట్లాడుతున్నారు. అర్హత తెలుసుకోకుండా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఒక్క దుబ్బాక గెలవడంతో బాగా మిడిసి పడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల గెలుపే వాళ్ల మిడిసిపాటుకు చెంప పెట్టుగా ఉండబోతుందన్నారు.

టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు. గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి, వారికి వేతనాలు పెంచారని తెలిపారు.

Tags :
|
|

Advertisement