Advertisement

  • కానిస్టేబుల్ ను రెడ్‌ హ్యాండెడ్‌గా‌ పట్టుకున్న మహిళ భర్త

కానిస్టేబుల్ ను రెడ్‌ హ్యాండెడ్‌గా‌ పట్టుకున్న మహిళ భర్త

By: chandrasekar Mon, 12 Oct 2020 8:55 PM

కానిస్టేబుల్ ను రెడ్‌ హ్యాండెడ్‌గా‌ పట్టుకున్న మహిళ భర్త


అనంతపూర్‌: హోటల్‌ గదిలో ఏఆర్ కానిస్టేబుల్ బాగోతం బయటపడింది. ఏఆర్‌ కానిస్టేబుల్‌ మరో మహిళతో హోటల్ గదిలో ఉండగా సదరు మహిళ భర్త రెడ్‌ హ్యాండెడ్‌గా వారిద్దరిని పట్టుకున్నాడు.

రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఈ వ్యవహారం వెలుగు చూసింది. బ్యూటిషిషన్‌గా పనిచేస్తున్నానంటూ తన భార్య ఏఆర్‌ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మహిళ భర్త ఆరోపించాడు.

భార్య ప్రవర్తనపై పోలీసుల వద్ద వాపోయాడు. ఏర్‌ కానిస్టేబుల్‌ని, మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు పంపారు.

Tags :

Advertisement