Advertisement

భార్య కోసం భర్త డిమాండ్...

By: chandrasekar Fri, 18 Dec 2020 5:59 PM

భార్య కోసం భర్త డిమాండ్...


కర్ణాకటలో కుడ్లిగి గ్రామానికి చెందిన దొడ్డప్ప అనే వ్యక్తి కొబ్బరి చెట్టు ఎక్కి గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. తాను చెట్టు మీద నుంచి దూకేస్తానంటూ బెదిరించాడు. గ్రామస్తులు అతడిని చెట్టు దిగాలని బతిమాలారు. అతడు చెట్టు ఎక్కడానికి కారణం దొడ్డప్ప రెండు పెళ్లిల్లు చేసుకున్నాడు. మొదటి భార్యకు పిల్లలు పుట్టకపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే, రెండో భార్యకు, దొడ్డప్పకు ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. అందువల్ల ఆమె ఐదేళ్ల కిందట దొడప్ప, పిల్లలను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లల బాధ్యత దొడ్డప్పకు ఇప్పుడు భారంగా మారింది. రోజూ ఆ పిల్లలకు వండి పెట్టలేక కష్ఠాలు పడుతున్నాడు . దొడ్డప్ప ఎన్నోసార్లు తన భార్యను ఇంటికి తీసుకురవడానికి సహకరించాలని గ్రామపెద్దలు కోరాడు. కానీ, గ్రామ పెద్దలు అంతగా పట్టించు కోలేదు. అందువల్ల వారిపై అలిగి కొబ్బరిచెట్టు ఎక్కాడు.

భార్యను ఇంటికి తీసుకొస్తాం కొబ్బరి చెట్టు దిగిరా అని చెప్పినా దొడ్డప్ప వినలేదు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. తన భార్య వచ్చే వరకు చెట్టు దిగనని చెట్టు పైనే కూర్చున్నాడు. సుమారు మూడు గంటల తర్వాత దొడ్డప్ప భార్య వచ్చింది. అయితే, దొడప్ప చెట్టు దిగలేకపోయాడు. దీంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో దొడ్డప్పను చెట్టు మీద నుంచి కిందికి దించారు. దొడ్డప్పకు, అతడి భార్యకు సమాధానపర్చి అక్కడనుంచి వెళ్లిపోయారు.

Tags :

Advertisement