Advertisement

ఆస్ట్రేలియాలో పెను విషాదం ...370 తిమింగలాలు మృతి

By: Sankar Sat, 26 Sept 2020 3:52 PM

ఆస్ట్రేలియాలో పెను విషాదం ...370 తిమింగలాలు మృతి


ఆస్ట్రేలియాలోని పెను విషాదం చోటు చేసుకుంది. మొత్తం 470 వేల్స్‌ తీరానికి కొట్టుకురాగా.. వీటిలో దాదాపు 370 వరకు మృత్యువాత పడ్డాయి. అధికారులు తీవ్రంగా శ్రమించి 108 వేల్స్‌ను రక్షించారు. మిగతావి బతుకుతాయని ఆశలు సన్నగిల్లడంతో వాటిని పారేయాలని నిర్ణయానికి వచ్చారు. టాస్మానియా రాష్ట్రంలోని మాక్వేరీ హార్బర్‌ వద్ద సోమవారం 470 తిమింగలాలు కొట్టుకొచ్చినట్టు వైమానిక నిఘా వర్గాలు గుర్తించాయి.

వీటిని రక్షించడానికి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే సహాయక చర్యలు చేపట్టారు. వీటిలో 108 వేల్స్‌ను రక్షించామని, మిగతావి చనిపోయి ఉంటాయని భావిస్తున్నామని అధికారులు తెలిపారు. సముద్రంలోనే 15 వేల్స్‌ను ఇప్పటికే పడేశామని వన్యప్రాణి సంరక్షణ అధికారి ఒకరు తెలిపారు. మిగతా 350 వేల్స్‌ను పారవేసేందుకు కొన్నిరోజులు పడుతుందని అన్నారు.

సకాలంలో సమర్ధవంతంగా కార్యాచరణ పూర్తిచేయడానికి ఆక్వాకల్చర్ కంపెనీల సహకారం తీసుకుంటున్నామని వివరించారు. చనిపోయిన వేల్స్‌‌‌ను సమూహాలుగా విడదీసి, వాటిని ఒకే చోట ఉంచడానికి ప్రయత్నిస్తాం. షార్క్‌లు, ఇతర మాంసాహార జంతువుల కంటబడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.

Tags :
|

Advertisement