Advertisement

  • హత్రాస్ ఘటనలో అక్షయ్ కుమార్ వ్యాఖ్యలను తప్పుపట్టిన యాక్టివిస్ట్

హత్రాస్ ఘటనలో అక్షయ్ కుమార్ వ్యాఖ్యలను తప్పుపట్టిన యాక్టివిస్ట్

By: Sankar Thu, 01 Oct 2020 08:01 AM

హత్రాస్ ఘటనలో అక్షయ్ కుమార్ వ్యాఖ్యలను తప్పుపట్టిన  యాక్టివిస్ట్


హత్రాస్ ఘటనతో దేశం మొత్తం మరొకసారి ఉలిక్కిపడింది..నిర్భయ , దిశా వంటి ఘటనల తర్వాత కూడా మృగాలలో ఎటువంటి మార్పు రాలేదు..ఉత్తరప్రదేశ్‌లోని హాత్రాస్‌ జిల్లాలో సెప్టెంబర్‌ 14న తన కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులకు వెళ్లింది యువతి. తల్లి, సోదరుడికి కొంచెం వెనుకగా గడ్డి కోస్తుండగా అక్కడే మాటు వేసి ఉన్న నలుగురు అగ్రకులాలకు చెందిన యువకులు ఆమెను పక్కనే ఉన్న పొలంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. మెడకు చున్నీ చుట్టి హింసించారు.

ఏమాత్రం జాలి, దయ లేకుండా యువతి నాలుకను కోసి చిత్ర హింసలకు గురి చేశారు. బాధితురాలి వెన్నుముక దెబ్బతినడంతో కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. ఇంటర్‌నల్‌ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నంది. శరీరమంతా గాయాలు, నాలుక కూడా కోసి హింసించారు కిరాతకులు. ఈ దారుణమారణ కాండ నుంచి కోలుకోలేక కన్నుమూసింది మరో నిర్భయ. దాదాపు 15 రోజులు నరకయాతన పడి మృత్యు ఒడికి చేరుకుంది. ఈ దారుణమైన ఘటన దేశం మొత్తాన్ని కలిచి వేసింది..

అయితే అక్షయ్ కుమార్ స్పందించాడు ..హత్రాస్ సామూహిక అత్యాచారం క్రూరమైన చర్య గురించి విన్నాక కోపం, నిరాశ కలుగుతున్నాయి. ఇవి ఎప్పుడు ఆగుతాయి? మన చట్టాలు, వాటి అమలు మరింత కఠినంగా ఉండాలి. శిక్ష గురించి ఆలోచిస్తే అత్యాచారం చేసే వారికి వెన్నులో వణుకు పుట్టాలి. నేరస్థులను ఉరితీయాలి." అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అక్షయ్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన కవిత కృష్ణన్ అనే యాక్టివిస్ట్ స్పందించారు. అక్షయ్ వ్యాక్యలను ఆమె తప్పుబట్టారు. 'అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించాలనేది స్త్రీవాద డిమాండ్ కాదు. స్త్రీలపై జరిగే దాడులను నివారించడం వారిపై జరిగే దారుణాలపై న్యాయమైన విచారణ జరగాలనేది స్త్రీవాద ప్రధాన ఉద్దేశం. మరణశిక్షను అత్యాచార చట్టంలో చేరిస్తే ఎక్కువ మంది బాధితులు నిందితుల చేత చంపబడతారు." అని ఆమె చెప్పుకొచ్చారు.

Tags :

Advertisement