Advertisement

  • డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్‌కు భారీ భ‌ద్ర‌త‌...

డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్‌కు భారీ భ‌ద్ర‌త‌...

By: chandrasekar Fri, 06 Nov 2020 3:48 PM

డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్‌కు భారీ భ‌ద్ర‌త‌...


అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో లీడింగ్‌లో ఉన్న మాజీ ఉపాధ్య‌క్షుడు, డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్‌కు భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆ దేశానికి చెందిన సీక్రెట్ స‌ర్వీస్‌ బైడెన్ వ‌ద్ద‌కు ప్ర‌త్యేక అధికారుల‌ను పంప‌నున్న‌ది. డెమోక్ర‌టిక్ నేత‌కు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు సీక్రెట్ స‌ర్వీస్ పేర్కొంది. ప్ర‌స్తుతం డెలావ‌ర్‌లోని విల్మింగ్ట‌న్‌లో బైడెన్ ఉన్నారు. వైట్‌హౌజ్ రేసులో విక్ట‌రీ సాధించిన‌ట్లు ఆయ‌న ఇవాళ ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయి. విల్మింగ్ట‌న్‌ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ నుంచే బైడెన్ ప్ర‌సంగించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, అందుకే ఆయ‌న‌కు అక్క‌డ సీక్రెస్ స‌ర్వీస్ ర‌క్ష‌ణ క‌ల్పించ‌నున్న‌ట్లు సమాచారం.

మ‌రోవైపు కౌంటింగ్‌ను ఆపివేయాలంటూ జార్జియా, మిచిగ‌న్‌లో కేసులు వేసిన ట్రంప్ బృందానికి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ కేసుల‌ను కోర్టులు కొట్టివేశాయి. కౌంటింగ్‌ను ఆపాల‌ని ట్రంప్ మ‌ద్ద‌తుదారులు, మెయిల్ ఇన్ ఓట్లు అన్నీ లెక్కింపు చేయాల‌ని బైడెన్ మ‌ద్ద‌తుదారులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌డుతున్నారు. దేశంలోని అనేక న‌గ‌రాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కౌంటింగ్ సెంట‌ర్ల వ‌ద్ద కూడా ధ‌ర్నా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌డుతున్నారు. ఫిలిడెల్ఫియాలోని ఓట్ కౌంటింగ్ సెంట‌ర్‌పై దాడికి ప్ర‌య‌త్నించిన ఓ కుట్ర‌ను పోలీసులు కనుగొన్నారు. జార్జియాలో పోరు హోరాహోరీగా మార‌డంతో అబ్సెంటీ ఓట‌ర్లు త‌మ ఓట్ల‌ను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాల‌ని డెమోక్ర‌టిక్ పార్టీ పిలుపునిచ్చింది.

Tags :
|

Advertisement