Advertisement

  • విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు ..

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు ..

By: Sankar Wed, 14 Oct 2020 10:03 PM

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు ..


విజయవాడ ప్రకాశం బ్యారేజీకి గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ప్లో 7 లక్షల 67 వేల క్యూసెక్కులు, ఔట్ ప్లో 7 లక్షల 64 వేలుగా ఉంది. అయితే ఇప్పటికే కృష్ణా ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ కాల్వలకు సాగునీటి అవసరాలకు 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.

పులి చింతల ప్రాజెక్ట్ నుంచి 5 లక్షల 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్న మున్నేరు, వైరా, కట్టలేరు, కీసర వాగుల నుంచి భారీగా వరద నీరు వచ్చి పడుతోంది. బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. లో తట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం ఇప్పటికే విజయవాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏ క్షణంలోనైనా సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశాలు అందాయి. పున రావాస శిబిరాల్లో ఉండేవారికి రూ.500ల సాయం అందించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Advertisement