Advertisement

  • భారీ తగ్గింపు... మరింత తక్కువ ధరలో రియల్ మీ 6 సిరీస్ స్మార్ట్ ఫోన్లు..

భారీ తగ్గింపు... మరింత తక్కువ ధరలో రియల్ మీ 6 సిరీస్ స్మార్ట్ ఫోన్లు..

By: chandrasekar Mon, 16 Nov 2020 8:30 PM

భారీ తగ్గింపు... మరింత తక్కువ ధరలో రియల్ మీ 6 సిరీస్ స్మార్ట్ ఫోన్లు..


స్మార్ట్ ఫోన్లు రోజుకొక్కటి విడులవుతున్న ఈ సమయంలో పోటీ ఏర్పడి రియల్ మీ తన స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గించింది. రియల్ మీ ఈ సంవత్సరం మార్చిలో రియల్ మీ 6 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో రియల్ మీ 6 స్మార్ట్ ఫోన్‌పై ప్రస్తుతం భారీ ధర తగ్గింపును అందించింది. ఇందులో మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌ను అందించారు. దీంతోపాటు ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు కూడా ఉన్నాయి. దీనిలో వెనుక వైపు ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉంది. ఫాస్ట్ చార్జింగ్ కూడా ఇందులో అందించారు. ఈ సిరీస్ లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999కు తగ్గింది. ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999కు తగ్గించారు. కామెట్ బ్లూ, కామెట్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో వున్నాయి.

రియల్ మీ 6 స్పెసిఫికేషన్లు క్రింది విధంగా:

* ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అల్ట్రా స్మూత్ డిస్ ప్లేను అందించారు.

* ఇందులో యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 90.5 శాతంగా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లను కూడా ఇందులో అందించారు.

* మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్‌ను గేమింగ్‌కు కూడా ఉపయోగపడేలా రూపొందించారు.

* వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న శాంసంగ్ జీడబ్ల్యూ1 సెన్సార్ ను అందించారు. ఇక దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సార్, 2 మెగా పిక్సెల్ క్వార్టియరీ సెన్సార్ లు కూడా ఉన్నాయి.

* సెల్ఫీల కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ కెమెరాను ఇందులో అందించారు.

* బ్యాటరీ సామర్థ్యం 4,300 ఎంఏహెచ్ గా ఉంది. ఇక 30W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కూడా రియల్‌మీ 6 సపోర్ట్ చేస్తుంది.

* ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీయూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. దీంతోపాటు 4జీ వోల్టే, వైఫై 802.11ac, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

* యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లను ఇందులో అందించారు. ఈ ఫోను బరువు 191 గ్రాములుగా వుంది.

Tags :

Advertisement