Advertisement

  • స్కూల్ ఫీజు వేధింపుల వ్యవహారంలో శివ బాలాజీ ఫిర్యాదుపై స్పందించిన మానవ హక్కుల కమిషన్

స్కూల్ ఫీజు వేధింపుల వ్యవహారంలో శివ బాలాజీ ఫిర్యాదుపై స్పందించిన మానవ హక్కుల కమిషన్

By: Sankar Wed, 16 Sept 2020 6:36 PM

స్కూల్ ఫీజు వేధింపుల వ్యవహారంలో శివ బాలాజీ ఫిర్యాదుపై స్పందించిన మానవ హక్కుల కమిషన్


మణికొండ లోని మౌంట్ లిటరజీ స్కూల్ పై తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సి) ఛైర్మన్ కు సినీ నటుడు శివబాలాజీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ స్కూల్ యాజమాన్యం ఫీజ్ కోసం వేధిస్తుంది అని ఆరోపించారు. ఫీజులు తగ్గించుకోమని అడిగితే తన కుమారుడిని ఆన్లైన్ క్లాసుల నుండి అర్ధాంతరంగా డిస్ కనెక్ట్ చేసారు అని తెలిపాడు. అయితే శివబాలాజీ ఫిర్యాదు పై హెచ్‌ఆర్‌సి స్పందించింది.

మౌంట్ లిటేరాజీ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌సి ఆదేశించింది. సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా DEO కి నోటీసులు పంపింది. అయితే చాలా మంది తలిదండ్రులను ఇలానే ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పిన ఆయన వారంత బయటికి చెప్పడానికి భయపడుతున్నారు అని శివబాలాజీ అన్నారు. ఇక ఈ స్కూల్ కారణంగా మేము కూడా సమస్యలు ఎదుర్కున్నాము అని కమెడియన్ ఆలీ కూతురు కూడా చెప్పిన విషయం అందరికి తెలిసిందే.

అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడం తో పాఠశాలలు అన్ని మూతపడ్డాయి..అయితే ప్రైవేట్ పాఠశాలలు మాత్రం ఆన్ లైన్ క్లాస్ ల పేరుతో కరోనా సిట్యుయేషన్ లో కూడా విద్యార్థుల తల్లి తండ్రుల నుంచి ముక్కు పిండి ఫీజులు వాసులు చేస్తున్నాయి..కానీ సామాన్య మధ్య తరగతి తల్లి తండ్రులు తమ పిల్లల భవిష్యత్ పాడు అవుతుంది అని ఆ ఫీజుల జులుం మీద నోరు మెదపలేకపోతున్నారు..

Tags :

Advertisement