Advertisement

  • ఎంతో రుచి మరియు ఎంతో తేలికయిన రవ్వ దోస తయారీ విధానం

ఎంతో రుచి మరియు ఎంతో తేలికయిన రవ్వ దోస తయారీ విధానం

By: Sankar Tue, 01 Sept 2020 8:31 PM

ఎంతో రుచి మరియు ఎంతో తేలికయిన రవ్వ దోస తయారీ విధానం


చాల మంది రవ్వ లేదా ఉప్మా అనగానే అబ్బా ఉప్మా నా అని అంటారు ..అదే రవ్వ తో రవ్వ దోస అని అంటే మాత్రం ఎంతో ఇష్టంగా తింటారు..మరి అలాంటి రవ్వ దోస తయారీ విధానం ఎలానో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు :

బియ్యం పిండి: 1కప్ , మైదా: 1కప్, సూజి(రవ్వ): 1కప్, శెనగపిండి: 1/4(అవసరమనుకొంటేనే) , పచ్చిమిర్చి: 4-6 , కరివేపాకు: రెండు రెమ్మలు, క్యారెట్ తురుము: 1టేబుల్ స్పూన్ , జీలకర్ర: 1/2 టేబుల్ స్పూన్ , ఉప్పు : రుచికి సరిపడా, నూనె: సరిపడా

తయారీ విధానం :

1. ముందుగా పచ్చిమిర్చిని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకును కూడా కట్ చేసి పెట్టుకోవాలి.

2. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, మైదా, సూజి(సన్న రవ్వ), శెనగపిండి, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కరివేపాకు తురుము, జీలకర్ర పొడి, ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసి(అప్రాక్సిమేట్ గా ఒక ఆరు కప్పులు)దోసె పిండిలా జారుడుగా కలుపుకోవాలి.

3. ఇప్పుడు పది పదిహేను నిమిషాల తర్వాత స్టౌ వెలిగించి, దోసె పాన్ పెట్టి వేడయ్యాక దోసె పోసుకొని పాన్ పూర్తిగా దోసెను రౌండ్ గా దిద్దుకొని పైన కొద్దిగా నూనె చల్లుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ తక్కువ మంట మీద కాల్చుకోవాలి.

4. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని మీకు ఇష్టమైన చట్నీ మరియు సాంబార్ తో వేడి వేడిగా సర్వ్ చేయాలి.







Tags :
|
|
|

Advertisement