Advertisement

  • తల్లి మరియు తండ్రి ఇద్దరు ఐసోలేషన్లో ఉంటే పిల్లలకు తిండి ఎలా

తల్లి మరియు తండ్రి ఇద్దరు ఐసోలేషన్లో ఉంటే పిల్లలకు తిండి ఎలా

By: chandrasekar Mon, 10 Aug 2020 2:33 PM

తల్లి మరియు తండ్రి ఇద్దరు ఐసోలేషన్లో ఉంటే పిల్లలకు తిండి ఎలా


కరోనా వ్యాప్తి విపరీతంగా తాకు తుండడంతో అనేక కుటుంబాల్లో రక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుటుంబ పెద్దకు కరోనా వస్తే ఆర్ధిక ఇబ్బందులు మొదలవుతాయి అదే ఇద్దరికీ తల్లి మరియు తండ్రికి కరోనా సోకితే పిల్లలకు తిండి పెట్టె వాళ్ళు లేక అనేక ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఆయన భార్యకు సైతం లక్షణాలు కనిపించాయి.

ఇప్పుడు మొదలైనది సమస్య? సమస్య ఏమిటంటే, ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లకు వండిపెట్టలేరు. తమకోసం తాము వండుకోనూలేరు. మరేమిటి పరిష్కారం? సాయం కోసం, సామాజిక మాధ్యమంలోని ఫూడీస్‌ గ్రూప్‌లో ఒక పోస్ట్‌ పెట్టాడు అతను. దీంతో దగ్గరలోనే ఉన్న ఓ హోం షెఫ్‌ స్పందించారు. వారికి, ఇప్పుడు రోజూ ఆహారం పంపిస్తున్నారు.

కుటుంబంలోని అమ్మానాన్నల్లో ఎవరు ఐసొలేషన్‌లో ఉండాల్సి వచ్చినా పిల్లలకు కష్టమే. బంధువులు కన్నెత్తి చూడరు కనీస సహాయం కూడా చేయరు. ఇరుగూపొరుగు వారు కూడా సహకరించరు. అలాంటి వారికి సమయానికి భోజనం అందేలా సహకరిస్తున్నాయి ఫూడీ గ్రూప్స్‌. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి వేళల్లో టిఫిన్‌ లేదా భోజనం సమకూరుస్తున్నాయి.

ఈ అవకాశాన్ని వినియోగించుకొని హోటల్స్‌లో కూడా వివిధ రకాల ప్యాకేజీలను ఇప్పుడు ప్రవేశ పెడుతున్నారు. పదిహేను రోజులకు మూడుపూటలా కలిపి ఒక్కరికి ఎనిమిది వేల నుంచి పదివేల వరకూ వసూలు చేస్తున్నారు. దీనివల్ల ఒకరి కష్టం తీరినట్టు ఉంటుంది. మరొకరికి ఉపాధి లభించినట్టూ ఉంటుంది. ఈ రకంగానైనా ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న హోటల్స్ కు ఉపాధి అవకాశాలు ఏర్పడినట్లవుతుంది.

Tags :

Advertisement