Advertisement

కరెన్సీ నోట్లు చినిగిపోతే ఎలా మార్చుకోవాలి?

By: chandrasekar Tue, 03 Nov 2020 7:08 PM

కరెన్సీ నోట్లు చినిగిపోతే ఎలా మార్చుకోవాలి?


చినిగిపోయిన లేదా బాగా నలిగిపోయన కరెన్సీ నోట్లను కొంత మంది తీసుకోరు. దీంతో ఆ నోట్లు మన వద్దనే అలాగే ఉండిపోతాయి. రూ.10 నోటు లేదా రూ.20 నోటు అయితే పెద్దగా పట్టికోం. అదే అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లు చినిగిపోతే మాత్రం బాధపడతాం. అయితే నోట్లు చినిగిపోతే బాధ పడాల్సిన అవసరం లేదు. చినిగిపోయిన నోట్ల స్థానంలో కొత్త కరెన్సీ నోట్లను పొందొచ్చు. కొత్త కరెన్సీ నోట్లు అంటే బాగున్న కరెన్సీ నోట్లు అని అర్థం.

RBI మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు కస్టమర్లకు చినిగిపోయిన నోట్లకు బదులుగా బాగున్న నోట్లను ఇవ్వాలి. మీరు తీసుకెళ్లే నోటు డూప్లికేట్ కాకపోతే చాలు. బ్యాంకులు మీ చినిగిపోయిన నోట్లకు బాగున్న వేరే నోట్లను యిస్తాయి. అంతేకాకుండా మీరు ఏ బ్యాంకుకు వెళ్లైనా సరే పాత చినిగిపోయిన నోట్లను మార్చుకోవచ్చు. ఇంకా బ్యాంకులు నోట్ల మార్పిడికి ఎలాంటి డబ్బులు తీసుకోవు. అంటే ఉచితంగానే మీకు చినిగిపోయిన నోట్లకు బాగున్న నోట్లు లభిస్తాయి. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో చినిగిపోయిన నోట్లకు వేరే నోట్లు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించొచ్చు. కరెన్సీ నోట్లు కలిపోయినా లేదంటే బాగా ముక్కలు ముక్కలుగా చినిపోయినా బ్యాంకులు వేరే నోట్లు ఇవ్వకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో మీరు ఇలాంటి నోట్లను ఆర్‌బీఐ ఆఫీస్‌కు వెళ్లి డిపాజిట్ చేయాలి. అందువల్ల మీ వద్ద చినిగిపోయిన నోట్లు ఉంటే దగ్గరిలోని బ్యాంకుకు వెళ్లి వాటిని మార్చుకోండి.

Tags :
|

Advertisement