Advertisement

క్రికెట్ అంటే భారతీయులకు ఎంత అభిమానం ఉందో...?

By: chandrasekar Thu, 10 Dec 2020 11:46 PM

క్రికెట్ అంటే భారతీయులకు ఎంత అభిమానం ఉందో...?


ఐపీఎల్ 13 యుఏఈ వేదికగా విజయవంతంగా ముగిసిన విషయం తేలిసిందే. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు క్యాషి లీగ్‌ను నిర్వహించారు. కరోనా వైరస్ కారణంగా బీసీసీఐ యుఎఇలో టోర్ని నిర్వహించింది. కరోనా మహమ్మారి కంటే ఇండియన్స్ ఎక్కువగా ఐపీఎల్‌ గురించే వెతికారని ‘గూగుల్‌ ఇండియా’ తెలిపింది. ఆ తర్వాత స్థానంలో కరోనా ఉన్నట్లు తన నివేదికలో ప్రకటించింది. 2020 ఐపీఎల్ తర్వాత కరోనా వైరస్, అమెరికా ఎన్నికలు, ప్రధాని కిసాన్‌ పథకం, బిహార్‌, దిల్లీ ఎన్నికలను భారత్-చైనా వివాదం, రామ్‌మందిర్‌ వంటి అంశాలు ట్రెండింగ్‌లో నిలిచాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో బోర్డు ఐపీఎల్ ఈవెంట్ విజయవతంగా పూర్తి చేయగలిగింది. యుఎఇలోని దుబాయ్, షార్జా ,అబుదాబి మొత్తం 3 స్టేడియాలలో ఐపిఎల్ నిర్వహించారు. ఈ ఈవెంట్ సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరిగింది.నవంబర్ 10 జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఐదో సారి టైటిల్ గెలిచింది. ఇక ఐపీఎల్ 2020 ను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు బిసిసిఐ భారీ మొత్తాన్ని చెల్లించింది.

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దేశం కానీ దేశంలో టోర్నీని నిర్వహించి విజయవంతం చేసింది. టోర్ని ఎంతటి విజయవంతంగా కొనసాగిందో చెప్పడానికి గణంకాలు రుజువు చేశాయి. స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరిగాయి. ఐపీఎల్‌-2020 అభిమానులకు ఊహించని మాజాను అందించింది. మైదానంలో అభిమానులే లేని ఈ టోర్ని క్రీడా అభిమానులను ఆకట్టుకుందా అని చాలా మంది మదిలో అనుమానం ఉంది. బ్రాడ్‌కాస్ట్ అడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణంకాలను చూస్తే ఈ విషయం రుజువవుతోంది.

Tags :
|

Advertisement