Advertisement

  • ఆమెను ఇంకా ఎంతకాలం గృహ నిర్బంధంలో ఉంచుతారు ..ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీమ్ కోర్ట్

ఆమెను ఇంకా ఎంతకాలం గృహ నిర్బంధంలో ఉంచుతారు ..ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీమ్ కోర్ట్

By: Sankar Tue, 29 Sept 2020 8:21 PM

ఆమెను ఇంకా ఎంతకాలం గృహ నిర్బంధంలో ఉంచుతారు ..ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీమ్ కోర్ట్

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ఇంకా ఎంత కాలం గృహ నిర్బంధంలో ఉంచుతారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఏ ఆదేశం ప్రకారం, ఏ ఉద్దేశంతో ఆమెను నిర్బంధంలో ఉంచుతున్నారని కోర్టు జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని నిలదీసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆధ్వర్యంలోని ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది.

మెహబూబా ముఫ్తీని ఇంకా ఎంత కాలం గృహ నిర్బంధంలో ఉంచుతారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. ఇందుకు కొంత సమయం ఇవ్వాలని.. ఒక వారంలోపు దీనిపై వివరణ ఇస్తామని ఆయన కోర్టుకు తెలిపారు. దాంతో రెండు వారాలు గడువు ఇచ్చింది. మెహబూబా ముఫ్తీ కుమార్తె, కుమారుడు ఆమెను కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలని తెలిపింది. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 15కు వాయిదా వేసింది.

మెహబూబా ముఫ్తీ విడుదల కోసం ఆమె కుమార్తె ఇల్టిజా ముఫ్తీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన తల్లిని నిర్బంధించడం అక్రమమని ఆరోపించారు. దీనిపై తాను గతంలో దాఖలు చేసిన పిటిషన్‌కు జమ్ముకశ్మీర్ అధికారులు కోర్టుకు ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని.. ఇది కోర్టు పట్ల వారికున్న గౌరవాన్ని తెలియజేస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. అధికారులు తన తల్లిని కలిసేందుకు అనుమతించడంలేదని ఫిర్యాదు చేశారు. ముఫ్తీని కోర్టులో ప్రవేశపెట్టేందుకు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు కోసం కోర్టు అనుమతి కోరారు

Tags :

Advertisement