Advertisement

  • కరోనా కేసుల పెరుగుదల కారణంగా ఆస్పత్రుల్లో సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు ఉండాలి

కరోనా కేసుల పెరుగుదల కారణంగా ఆస్పత్రుల్లో సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు ఉండాలి

By: chandrasekar Mon, 14 Sept 2020 4:42 PM

కరోనా కేసుల పెరుగుదల కారణంగా ఆస్పత్రుల్లో సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు ఉండాలి


కరోనా పెరుగుదల కారణంగా అన్ని ఆస్పత్రుల్లో సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు ఉండేలా చూసుకోవాలని, అంతర్‌ రాష్ట్ర, అంతర్‌ జిల్లా రవాణాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆరోగ్య, పరిశ్రమ ల శాఖ కార్యదర్శులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా తగినంత నిల్వల ఏర్పాటు, రవాణాపై చర్చించారు.

ఆస్పత్రుల వారీగా నిర్వహణ, ముందస్తు ప్రణాళిక రూపొందించుకుంటే పూర్తిగా అయిపోకముందే జాగ్రత్తపడొచ్చని తెలిపింది. నగరాల మధ్య ఎల్‌ఎంవో ట్యాంకర్ల సరఫరాకు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. ఆక్సిజన్‌ సరఫరాలో ఆస్పత్రులు, వైద్య సంస్థలకు దీర్ఘ కాల కాంట్రాక్టులు లేని విషయాన్ని గుర్తించాలని వివరించింది. అవాంతరాలు లేని సరఫరా కోసం ఉత్పత్తి, సరఫరాదారులకు సకాలంలో డబ్బు చెల్లించాలని సూచించింది. భర్తీ కోసం పంపిన సిలిండర్లను సరైన విధంగా డిస్‌ఇన్ఫెక్షన్‌ చేసేలా చూడాలని రాష్ట్రాలకు సూచించారు.

Tags :
|

Advertisement